సోమవారం, మే 04, 2020

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా...

మూగమనసులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. శివ తత్వాన్ని వివరిస్తూ కథలో కూడా ఇమిడిపోయేట్టుగా కొసరాజు గారు రాసిన ఈ ఆరు నిముషాల పల్లెపదం ఈ రోజుకి అలరిస్తుందంటే సామాన్యమైన విషయం కాదు.


చిత్రం : మూగ మనసులు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, సుశీల

హెయ్.. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

సెప్పాలంటే సిగ్గు కదయ్యా.. ఆ..
ఆనవాళ్ళు నే సెబుతానయ్య..
సెప్పు.. సెప్పు..
సిగలో నెలవంక మెడలో నాగరాజు
సిగలో నెలవంక మెడలో నాగరాజు
ఆ రేడు నావాడు సరిరారు వేరెవరూ...

మావయ్యా నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా

ఇల్లు వాకిలి లేనీవాడు..
లే..నీ.. వా..డూ.. లేనీవాడు..
బిచ్చమెత్తుకుని తిరిగేవాడు..
మాదాకవళం
ఇల్లు వాకిలి లేనీవాడు..
బిచ్చమెత్తుకుని తిరిగేవాడు
ఎగుడు దిగుడు కన్నులవాడు
జంగందేవర నీ వాడా

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఆకాశమే ఇల్లు.. లోకమే వాకిలీ..ఈ.. అవును..
బిచ్చమడిగేది భక్తీ.. ఈ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తీ.. బదులు ఇచ్చేది ముక్తి
బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..
మావయ్యా నా మొగుడెవరయ్యా

మొగుడు మొగుడని మురిసావే..
కులికావే.. పొగిడావే..
మొగుడు మొగుడని మురిసావే..
కులికావే.. పొగిడావే..
పిల్లోయ్.. నెత్తిని ఎవరినో ఎత్తుకొని
నిత్యం దానినే కొలుసునట
అదియే ఆతని ఆలియట..
కోతలు ఎందుకు కోస్తావే..
కోతలు ఎందుకు కోస్తావే..

గౌరమ్మో నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా.. ఆ..
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఎవరో పిలిస్తె వచ్చింది..
ఎవరి కోసమో పోతోంది..
మయాన మజిలీ ఏసింది
మయాన మజిలీ ఏసింది..
సగం దేహమై నేనుంటే
అది పెళ్ళామంటే చెల్లదులే
సగం దేహమై నేనుంటే
అది పెళ్ళామంటే చెల్లదులే
పళ్ళు పదారు రాలునులే..
పళ్ళు పదారు రాలునులే..

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా.. ఆ..

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
మావయ్యా.. గౌరమ్మా..
మావయ్యా.. గౌరమ్మా..


2 comments:

కొసరాజు గారు అద్భుతమైన సాహిత్యం వ్రాశారు ఈ పాటలో. Very Good song.

అవునండీ.. చాలా బావుంటుంది.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.