ఆదివారం, మే 24, 2020

చిలకా ఏ తోడు లేక...

శుభలగ్నం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభలగ్నం (1994)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి     
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా
కొనగలవా చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక


బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక


అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో
ఆనందం కొనలేని ధన రాశితో
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా
కొనగలవా చెయ్ జారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక

చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
 

2 comments:

A very beautiful melodious classic song with meaningful lyrics. సీతారామ శాస్త్రి, కృష్ణా రెడ్డి, బాలు గారు నమో నమ:

The painting is very relevant to the song

థ్యాక్సండీ.. మీకు నచ్చినందుకు సంతోషం..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.