శుక్రవారం, మే 01, 2020

పచ్చందనమే పచ్చదనమే...

సఖి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చాలా అందంగా చిత్రీకరించిన పాట ఇది. అప్పట్లో ఎన్ని సార్లు వినీ చూసీ ఉంటానో లెక్కేలేదు. మాధవన్, షాలిని జంటతో ప్రేమలో పడని వాళ్ళు అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో.


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, క్లింటన్

సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు

పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమే
యదకు సమ్మతం చెలిమే
యదకు సమ్మతం చెలిమే

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికే కొపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె
ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చ
కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ పచ్చా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం

సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా చెలియా నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు

అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం
ఊదా పూరెక్కల పై వర్ణం
ఎన్నో చేరెనీ కన్నె గగనం
నన్నె చేరె ఈ కన్నె భువనం

రాత్రీ నలుపే రంగు నలుపే
వానా కాలం మొత్తం నలుపే
కాకీ రెక్కల్లొ కారు నలుపే
కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగీ పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే

సఖియా చెలియా కౌగిలి
కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియ చెలియ నీ ఒంపె
సొంపె తొణికిన తొలి పండు

తెల్లని తెలుపే యద తెలిపే
వానలు కడిగిన తుమ్మి తెలుపే
తెల్లని తెలుపే యద తెలిపే
వానలు కడిగిన తుమ్మి తెలుపే
ఇరు కనుపాపల కథ తెలిపే
ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే

 

8 comments:

కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికే కొపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె
ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చ
కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ పచ్చా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం

ఈ సాహిత్యం చదివితే నవ్వు ఆపు కోలేము. ఎంత డబ్బింగ్ పాట అయినా.

హహహ రెహ్మాన్ పాటలతో అదే కంప్లైంట్ అండీ.. పాట బావుంటుంది కానీ ఎక్కువ శాతం డబ్బింగే.. కాకపోతే ఈ లిరిక్స్ "కుళ్ళిన మామిడిలో జత పురుగులమౌదం" లాంటి వాటికన్నా నయమేలే అనుకుని సంతోష పడడమే ;-)

గల్ఫ్ టీవీలలో హిందీ సినిమాలు వేసినప్పుడు డయలాగులు మాత్రమే డబ్బింగ్ చేసి, పాటలు యథాతథంగా ఉంచేస్తారు. అదే పని భారతీయ దేశంలో కూడా చేస్తే ఈ సోది తగ్గుద్దేమో.

>> "కుళ్ళిన మామిడిలో జత పురుగులమౌదం" ;-)<<
అంటే ఏంటి గురూ?

మీ సలహా బావుంది జై గారూ కానీ అలా చేస్తే కొన్ని మంచి పాటలు కూడా మిస్సయిండూవాళ్ళం లెండి.

హహహ సోదరా చెప్తా వినండి ;-) మన సినిమాలో వీరోవీరోవిన్లు ఓ ఇదిగా పేవించేస్కుని డబ్బుల్లేక ఉంటానికి ఇల్లు లేక ఓ పాడుపడిన కార్ షెడ్ లో కాపురవెడతారు. అపుడు ఆ చెత్తకుప్పలో దొరికే వస్తువులతో ఓ పాట తీయాలి గ్రాఫిక్స్ పెట్టి వాటితో డాన్సేయించే పూచీ నాదీ అని చెప్పుంటాడు డైరెట్రు. ఇక మన శివగణేష్ అండ్ ఏ.ఎం.రత్నం ఇద్దరు క్రియేటివిటీకి పదునెట్టేసి. ఇంటిపక్కనున్న చెత్తకుప్పమీద దాడి చేసి దాన్లో చేతికందిన వస్తువులు పట్టుకొచ్చి వాటిమీద ఇలా పాట రాసేరనమాట ;-)

https://telugumelodylyrics.blogspot.com/2017/02/boom-boom-song-lyrics-boys-movie-2003.html

హ హ హ. ఇంత దరిద్రమైన లిరిక్స్ నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు. పాపం ఆ గాయకులు ఇద్దరికీ, సంగీత దర్శకుడికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది.

మంచి పాటలకు నంది అవార్డ్ ఇచ్చినట్టుగా ఇలాంటి చెత్త పాటలకు కూడా ఏదైనా అవార్డ్ ఇవ్వాలి.

హహహ బహుశా తమిళ్ లిరిక్స్ కూడా ఇదే లైన్స్ లో ఉండుంటాయేమో అని నా డౌటండీ :-) ఆ పాట కాన్సెప్టే అబ్బో అరాచకం... అసలు ఈ సినిమా పాటల లిరిక్స్ అప్పట్లో మాములు కామెడీ కాదు ఇంకో పాటుంటుంది నే ఎండిపోయిన చెరువుని నువ్వు అందులో దూకిన కప్పవి ఈ టైప్ లో :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.