శనివారం, మే 16, 2020

ఏం జరుగుతోంది...

మహాత్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహాత్మ (2009)
సంగీతం : విజయ్ ఆంథోనీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్, సంగీత

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళ

ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఈవేళ

హే నీ ఎదుట నిలిచే వరకు
ఆపదట తరిమే పరుగు
ఏం  పనట తమతో తనకు
తెలుసా హో!


నీ  వెనక తిరిగే కనులు
చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావసలు
సొగసా!

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళ

ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఈవేళ

పరాకులో  పడిపోతుంటే
కన్నె వయసు బంగారు
అరే అరే అంటూ వచ్చి
తోడు నిలబడు

పొత్తిళ్ళలో పసిపాపల్లే
పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో
అడుగు అమ్మడు

ఆకాశమే ఆపలేనీ చినుకు మాదిరి
నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి

ఆవేశమే ఓపలేని వేడి ఊపిరీ నీతో
సావాసమే కోరుతోంది ఆదుకో మరి

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళ

ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఈవేళ

This is the way to go..
this is ecstasy 
this song is just
a vague mimicry
feeling is so meant to be..
yo.ho..
This indescribable
cant you see
knocks me down yo
baby cant believe
just a survival yes it is
yo.ho..

 
ఉండుండిలా ఉబికొస్తుందేం
కమ్మనైన కన్నీరు
తియ్యనైన గుబులిది అంటే
నమ్మేదేవ్వరూ

మధురమైన కబురందిందే
కలత పడకు బంగారు
పెదవితోటి చెక్కిలి నిమిరే
చెలిమి హాజరు

గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా

అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళ

ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఈవేళ

నీ ఎదట నిలిచే వరకూ
ఆపదట తరిమే పరుగూ

ఏం మాయ చేసావసలు
సొగసా!

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది
నా మనసుకివాళ

ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది
నా వయసు ఈవేళ
 

2 comments:

నేనూ ఓ పిచ్చోడినే అంటూ మనకు కూడా తెలియని మనసు వైద్యం చేస్తున్నారు. నేడు మనకు ఎం జరుగుతుందో తెలియదు కానీ వేణు గారి ఎం జరుగుతుంది వింటే మాత్రం ఏదోకటి జరుగుతోందిగా మార్పు.🤠

థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ చైతన్య గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.