మంగళవారం, మే 12, 2020

నవ్వవే నా చెలి...

అంతామనమంచికే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంతా మన మంచికే (1972)
సంగీతం : సత్యం 
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, వసంత 

ఓహోహోహో.. ఓహో.. ఓహో..
ఆహా.. ఆహా.. ఆహా..
హేహేహే.. హేహేహే.. హేహేహే..

నవ్వవే నా చెలి
నవ్వవే నా చెలి
చల్లగాలి పిలిచేను
మల్లెపూలు నవ్వేను
వలపులు పోంగే వేళలో

నవ్వనా నా ప్రియా
మూడు ముళ్ళు పడగానే
తోడు నీవు కాగానే
మమతలు పండే వేళలో
నవ్వనా నా ప్రియా


మనసులు ఏనాడొ కలిశాయిలే
మనువులు ఏనాడొ కుదిరాయిలే
నీవు నాదానవే.. నీవు నావాడవే
నేను నీవాడనే.. నేను నీ దాననే
ఇక నను చేరి మురిపింప బెదురేలనే 

నవ్వవే నా చెలి
నవ్వనా నా ప్రియ..

జగమేమి తలచేను మనకెందుకూ
జనమేమి పలికేను మనకేమిటీ
నేను నీవాడనే నేను నీదాననే
నిజమైన మన ప్రేమ గెలిచేనులే

నవ్వవే నా చెలి
నవ్వనా నా ప్రియా
చల్లగాలి పిలిచేను
మల్లెపూలు నవ్వేను
వలపులు పోంగే వేళలో

నవ్వవే నా చెలి
నవ్వనా నా ప్రియా..
ఏహేహే.. హేహే..
హోహోహో.. హోహోహో..

5 comments:

మంచి పాట. ఏదో హిందీ పాట ప్రభావం ఉంది. చివరిగా ఇచ్చిన పెయింటింగ్ చాలా బాగుంది.

సత్యం గారి పాటల్లో ఎక్కువగా రీమేక్ పాటలు ఉంటాయి.

అవునండీ ఏదో హిందీ పాట ప్రభావం ఉంది ముఖ్యంగా మధ్యలో వచ్చే మ్యూజిక్ అంతా హిందీ పాటదిలానే అనిపించింది నాక్కూడా కానీ ఏపాటో తెలియడంలేదు. మ్యూజిక్ కాస్త గాతారహే మేరా దిల్ తో కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

ఇదే అయి ఉంటుందా

Yeh Hawa Yeh Fiza Aa Bhi Ja

https://www.youtube.com/watch?v=aAWtkNcuI4Q

https://www.jiosaavn.com/lyrics/yeh-hawa-yeh-fiza-aa-bhi-ja-from-gumrah-lyrics/NjFeaz8IUWc

నాకైతే పోలికలు తెలియడం లేదు జయ్ గారూ..

అప్పట్లో నిర్మాతలు, కొందరు దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్స్ కు హిందీ పాటలు వినిపించి ఈ బాణీలో కావాలని అడిగేవారట అజ్ఞాత గారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.