బుధవారం, మే 20, 2020

ఒక దేవతా ప్రేమ దేవతా...

తరంగిణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తరంగిణి (1985)
సంగీతం : జె.వి.రాఘవులు  
సాహిత్యం : సినారె
గానం : బాలు, శైలజ 

నిర్మల సుర గంగాజల
మంజుల స్వర్ణకమలమో
క్షీరసాగర సమానీత
సుధాపూర్ణ కలశమో
ఆ ..ఆ..ఆ...ఆ..ఆ.

ఒక దేవత ప్రేమ దేవతా
పోత పోసిన అనురాగమో
ఏపూర్వజన్మల ప్రణయ
రమ్య రసయోగమో
ఒక దేవత ప్రేమ దేవతా

ఎదలో సూటిగా పదునుగా
నాటిన మదన బాణమో
పద పదమున మధు
మధురిమలోలికిన
రసోన్మాదమో..హొయ్
ఒక దేవత ప్రేమ దేవతా
రసికత దాచిన శృంగారమో
ఆ రతీదేవి ధరియించిన
తొలి అవతారమో...హాయ్..
ఒక దేవత ప్రేమ దేవతా


హా..ఆఆఅ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హృదయమే సుమ హారముగా అర్పించనా
జీవితమే కర్పూరముగా వెలిగించనా
ఆరాధన మాటున దాగిన
ఆవేదన ఎలా తెలుపను
మనసులోన రగిలే కలతను
మాటలతో ఎలా చెప్పను

హహ హహహహ
ఆరాదన ఒక నటన
ఆవేదన ఒక నటనా హహ
రసయోగం ఒక నటన
ఆ అనురాగం ఒక నటనా
అది నటనయని వంచనయని తెలిసెనులే
ఇక ఆ దేవత ఆ గుడిలో నిలవదులే
కోరుకున్న కోవెలలో చేరునులే
సరికొత్త ప్రేమ పూజలందితీరునులే


స్వార్ధం ఎరుగదు ప్రేమ
పరమార్ధం మరువదు ప్రేమ
ఆ ప్రేమకు రెండే అక్షరాలూ
అవి గగనాలు సాగరాలు
అవి అందుకోలేరు కాముకులూ
అవి పొందగా లేరు వంచకులూ

ఆ దేవతా ప్రేమ దేవతా
ఆ దేవతా ప్రేమ దేవతా
మదిలో వెలసిన మాధవుడే
ఎదురై నిలిచిన రాఘవుడే
ప్రియ విభుడు..
నా ప్రియ విభుడు..


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.