బుధవారం, మే 13, 2020

ఆహా ఏమి రుచి...

ఎగిరే పావురమా చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమాలో గుత్తొంకాయ్ పేరు వినగానే హీరోగారి కన్నా ముందు నేనే "ఆహా సూపరూ" అని అనుకున్నా. అసలు వంకాయని తిట్టిందని అంత అందంగా నవ్వే లైలాని కూడా కాసేపు ద్వేషించేశాను. ఆ తర్వాత పాట పాడిందని క్షమించేశా అనుకోండి. తాజా కూరల్లో రాజా (విత్ కిరీటం) వంకాయ గురించి మీరే విని తెలుసుకోండి.

  
 
చిత్రం : ఎగిరే పావురమా (1997)
సంగీతం : ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర 

ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ


అల్లం పచ్చిమిర్చీ
శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా..
ఘుమఘుమ ఘుమఘుమ
ఘుమఘుమలు

ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ


లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటోతో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి
ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు
తెలియగ తెలుపగ తరమా

ఆహా... ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా వంకాయేనండీ
ఆ...

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.