కన్నవారి కలలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట వీడియో నేను ఇపుడే చూస్తున్నాను. ఎప్పుడూ కళ్ళుమూసుకుని రేడియోలో రామకృష్ణ గారి గళమాధుర్యాన్ని ఆస్వాదించడమే గుర్తుంది.
చిత్రం : కన్నవారి కలలు (1974)
సంగీతం : వి.కుమార్
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడుకున్నాయో
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడుకున్నాయో
ఎన్నడు నా చేతులు నీ చేతులతో మాటాడుకున్నాయో
ఆ.. పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ
ఆ.. గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ
కలిసిన కౌగిలిలో కాలమే ఆగినదీ
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆహా చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆ.. కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
ఆ.. తనువే నీదైతే దాచేదేముంది
వలపుల వీణియపై బ్రతుకే మ్రోగిందీ

5 comments:
మంచి పాట. ఈ చిత్రం (1974 ) లో మధువొలక బోసే పాట కూడా చాలా బాగుంటుంది.
అవునండీ నా ఫస్ట్ ఫేవరెట్ కూడా ఆ పాటే. ఈ బ్లాగ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
https://sarigamalagalagalalu.blogspot.com/2016/04/blog-post_5.html
మొన్నటి పోస్ట్ నుండి రిలీజ్ ఇయర్ అప్డేట్ చేయడం మర్చిపోయానండీ.. థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. సరిచేశాను.
బాగుంది
థ్యాంక్స్ ప్రవీణ్ గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.