సోమవారం, మే 11, 2020

ధరణి మన్నించవే...

ఈ రోజు మీకు వినిపించబోయే పాట సినిమా పాట కాదు. లాక్ డౌన్ సంధర్బంగా మానవుడు ప్రకృతికి చేస్తున్న ద్రోహాన్ని తలుచుకుని ఆ ధరణీమాతను మన్నించమని వేడుకుంటూ ఫణికళ్యాణ్ కంపోజ్ చేసిన ఓ ప్రైవేట్ సాంగ్. నాకు చాలా నచ్చిన పాట ఇది. మీరూ చూసి విని మనకు తెలియకుండానే మనమూ విధ్వంసంలో భాగస్వాములం అయినందుకు మనసారా మన్నించమని వేడుకోండి. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సంగీతం : ఫణికళ్యాణ్
సాహిత్యం : ఇమ్రాన్ శాస్త్రి
గానం : ఆదిత్య రావ్, సమీర భరధ్వాజ్

ఏదీ చివరికి మిగలదా
మన కథ సాగే మనుగడలో 
మట్టి గాలి చెట్టు నీరు
మట్టుపెట్టుకున్నామంటూ
అని ఇక మములను బలిగొనకా

మన్నించవే మన్నించవే
మాతల్లివే మన్నించవే..

ధరణి మన్నించవే
ధరణి మన్నించవే 
ధరణి మన్నించవే
ధరణి మన్నించవే 

కాపు గాసే నీడను
కాలదన్నుకుంటిమి
దాహమార్పు నీరుపై
నిప్పు జల్లుకుంటిమి
నీ గుండె తొలచి
గురుతే చెరిపేసితి
నిన్నే విడచి
ఏటో పయనించితి
శిధిలమై బ్రతుకిక
మరల శరణు అంటి

ధరణి  మన్నించవే
ధరణి మన్నించవే 
ధరణి  మన్నించవే
ధరణి మన్నించవే 

గా సగస నిసని
పనిపమ గమమా
గమపని మప
గా సగస నిసనిప గమమా
నిసగమప గమపనీ
గనిసస గనిసస గనిసస
నిసనిప నీపప నీపప
నీపప మపమమ
గమప నిని సగమద
సనిపమమా
గమప నిని సగమప
మమపా మమపా మమపా

మట్టి తోటి భందమే
మరచి పోయి ఉంటిని
ఉన్నదంత దోస్తూనే
నిన్ను వేరు చేస్తిని
మలినమే నా మనసూ
నీ విలువేం తెలుసూ

ప్రాణకోటి శ్వాసకు
నీవు కాదా కారణo
మానవ స్వార్థమే
చేసే వినాశనం
విలపించే నను
కానవ ఈ క్షణం
తెలిసొచ్చే ఇక
ఆపవ ఈ రణం

ధరణి  మన్నించవే
ధరణి మన్నించవే 
ధరణి  మన్నించవే
కరుణ చూపించవే 

కాపు గాసే నీడను
కాలదన్నుకుంటిమి
దాహమార్పు నీరుపై
నిప్పు జల్లుకుంటిమి
నీ గుండె తొలిచి
గురుతే చెరిపేసితి
నిన్నే విడచి
ఏటో పయనించితి
శిధిలమై బ్రతుకిక
మరల శరణు అంటి

ధరణి  మన్నించవే
ధరణి మన్నించవే 
ధరణి  మన్నించవే
కరుణ చూపించవే

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.