గురువారం, మే 21, 2020

తెలుసునా తెలుసునా...

సొంతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సొంతం (2002)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్   
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర 

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా


అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకో
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా


గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతడి తలపే నిండి పోయుంది
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.