నకాష్ అజీజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నకాష్ అజీజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జులై 09, 2020

ఎంతవారు గాని...

నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో చిత్రంకోసం రీమిక్స్ చేసిన ఈ అన్నగారి పాట ఒరిజినల్ వర్షన్ కూడా రీమేకే కావడం ఓ విశేషం. ఒరిజినల్ పాట లోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఈ సినిమా ఆడియోలో వాడుకుంటే సినిమా కు వచ్చేసరికి ఎడిటింగ్ లో మొదటి చరణం మాత్రమే మిగిలింది. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రౌడీ ఫెలో (2014)
సంగీతం : టి.వి.రాజు/బోంబే రవి (హిందీ)
రీమిక్స్ : సన్నీ ఎమ్. ఆర్.  
సాహిత్యం : సినారె 
గానం : నకాష్ అజీజ్, నటాషా పింటో

ఈ పాటను తెలుగుకు అన్వయించిన సినారె గారి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ వినండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఒరిజినల్ హిందీ వర్షన్ "బార్ బార్ దేఖో" పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భలేతమ్ముడు (1969)
సంగీతం : టి.వి.రాజు / బోంబే రవి (హిందీ) 
సాహిత్యం : సినారె 
గానం : మొహమ్మద్ రఫీ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...

 

చిన్నది మేనిలో మెరుపున్నది హహ
చేపలా తళుకన్నది సైప లేకున్నది
చిన్నది మేనిలో మెరుపున్నది
చేపలా తళుకన్నది సైప లేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...
 
ఆడకు వయసుతో చెరలాడకు ఆహా
ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు
మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో..
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...
 
హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే..
హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే..
ఓయ్ పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్..
కైపులో కైపులో కైపులోఓఓ..
 
ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులోఓఓ...


మంగళవారం, డిసెంబర్ 10, 2019

బుజ్జి బుజ్జి బంగారం...

గుణ 369 చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుణ369 (2019)
సంగీతం : చైతన్ భరధ్వాజ్ 
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : నాకాష్ అజిజ్, దీప్తి పార్థసారధి

కలలో కూడా కష్టం కదే ఈ హాయి
కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి

వదలకుండ పట్టుకుంటా నీ చెయ్యి
నువ్వట్టా నచ్చేశావోయ్ అబ్బాయి

నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా
నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా
పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

తప్పదింక భరించవే నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం

నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం

సొంత ఊరిలో కళ్ల ముందరే
కొత్త దారులెన్నో పుట్టాయే
అంతేలేరా జంటగుంటే అంతేలేరా
సొంతవారితో ఉన్న నిన్నలే
గుర్తురాము పొమ్మనన్నాయే
జతలో పడితే జరిగే జాదూ ఇదేగా

ముద్దులెన్నో పెట్టాలిగా
పెట్టి గాల్లో పంపాలిగా
ఊపిరంతా గంధమైపోయేంతగా
ముందుకొచ్చే ఉన్నానుగా
ఎందుకమ్మా ఇంకా దగా
నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా

తప్పదింక భరించరా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం

నిన్ను తాకితే ఒక్కసారిగా
పట్టుకుంది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
ఉన్న జన్మనీ ముందు జన్మనీ
చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే

ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నాములే
వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
సర్లే సర్లే చెప్పావులే
సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

తప్పదింక భరించనా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం


గురువారం, జనవరి 24, 2019

ఎక్కడ నువ్వున్నా(ఊల్లాల్లా)...

పేట చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పేట (2018)
సంగీతం : అనిరుధ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజీజ్

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం

ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం 

  
కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూ
చుట్టూ కంచెలు కట్టీ లోకం చిన్నదనీ నిందించొద్దూ

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా


హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ

హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ


రెండు గుండెల అంతరం ఎంతా
చేయి చాచిన దూరం కాదా
పరులే లేరనుకుంటే లోకం
ఒకటే కుటుంబమై పోదా

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం 


గురువారం, ఆగస్టు 16, 2018

ఫస్ట్ లుక్కు సోమవారం...

ఛల్ మోహనరంగ చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛల్ మోహన రంగ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కేదార్నాథ్
గానం : నకాష్ అజీజ్

ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం

గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం

సారి అంది సుక్కురవారం
సెన్సార్ కట్ శనివారం,
రెస్ట్ లేదు ఆదివారం
ప్రేమే వుంది ఏ వారం

ప్రేమే వుంది ఏ వారం
ప్రేమే వుంది ఏ వారం

వారం కాని వారం
పెను ఎవ్వారం
నువ్వు బంగారం
తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం
చెయ్ జాగారం
గోడ గడియారం
మోగెను గుండెల్లో అల్లారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోనె రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు

ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం

దాని మమ్మీ లాగే దానిక్కూడా ఉందే ఎంతో పొగరు
అది చూపిస్తుంటే సర్రంటుంది బీపి నాదే బ్రదరు
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతోంది లివరు
ఇక నీకు నాకు సెట్ అవ్వదంటు చెప్పెను ఊటి వెదరు

వారం కాని వారం పేరు ఎవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయ్ జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అల్లారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోనె రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు


బుధవారం, ఫిబ్రవరి 14, 2018

ఛల్ మార్...

మిత్రులందరకూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అభినేత్రి చిత్రంలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినేత్రి (2016)
సంగీతం : సాజిద్-వాజిద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజిజ్

హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో జన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే సంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడే
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణం
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా నో బాలే వెయ్యకలా
నీ హార్టుకొక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బుల్ని టచ్ చేద్దాం

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
ఛల్ మార్

చల్ మార్
రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాధవు నువ్వేనే
నీ చూపే మాన్సూనే సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.