గురువారం, ఆగస్టు 16, 2018

ఫస్ట్ లుక్కు సోమవారం...

ఛల్ మోహనరంగ చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఛల్ మోహన రంగ (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కేదార్నాథ్
గానం : నకాష్ అజీజ్

ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం

గొడవయ్యింది గురువారం
గొడవయ్యింది గురువారం

సారి అంది సుక్కురవారం
సెన్సార్ కట్ శనివారం,
రెస్ట్ లేదు ఆదివారం
ప్రేమే వుంది ఏ వారం

ప్రేమే వుంది ఏ వారం
ప్రేమే వుంది ఏ వారం

వారం కాని వారం
పెను ఎవ్వారం
నువ్వు బంగారం
తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం
చెయ్ జాగారం
గోడ గడియారం
మోగెను గుండెల్లో అల్లారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోనె రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు

ఫస్ట్ లుక్కు సోమవారం
మాట కలిపే మంగళవారం
బుజ్జిగుంది బుధవారం,
గొడవయ్యింది గురువారం

దాని మమ్మీ లాగే దానిక్కూడా ఉందే ఎంతో పొగరు
అది చూపిస్తుంటే సర్రంటుంది బీపి నాదే బ్రదరు
నీ వల్లే తాగే మందుకి నన్నే తిడుతోంది లివరు
ఇక నీకు నాకు సెట్ అవ్వదంటు చెప్పెను ఊటి వెదరు

వారం కాని వారం పేరు ఎవ్వారం
నువ్వు బంగారం తప్పదు సోకుల సత్కారం
జాములేని వారం చెయ్ జాగారం
గోడ గడియారం మోగెను గుండెల్లో అల్లారం

నీ రూపం చూస్తె సెగలు
నీ కోపం చూస్తె దిగులు
నువ్వు అర్ధం కానీ పజిలు
నువ్వేలే నా విజిలు
నీ కళ్ళల్లోని పొగలు
నా గుండెల్లోనె రగులు
నువ్వు అందని ద్రాక్ష పళ్ళు
నువ్వేలే నా స్ట్రగులు


2 comments:

ట్యూన్ బావుంది..లిరిక్సే...

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.