శుక్రవారం, ఆగస్టు 03, 2018

చిట్టెమ్మా చిట్టెమ్మా...

కాలా చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కాలా (2018)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : వనమాలి
గానం : అనంతు, శ్వేతామోహన్

పువ్వల్లే నా ప్రేమ తేనూరునో
ఆ నింగి తేనేల్లు కురింపించునో
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

నా దేహమంతా నీ ప్రేమతావే
కాలాలు ఏమార్చెలే
ఎడమైన ప్రేమ తాకింది మంటై
దూరాలు పెరిగేనులే
నదిలాంటి ప్రేమే పయనాలు ఆపే
ఆ ఎండమావైనదే
కలలన్ని కరిగి చేజారగానే
కలతేమో బ్రతుకైనదే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయమెంతైన అది మానిపోదా

ఏ తీగ వీణా పలికించకుండా
రాగాలు వినిపించదే
శిశిరాన వాడే చిగురాకులాగా
నా ప్రేమ మోడైనదే
ఏ జాలి లేని విధిరాత కూడా
చేసింది ఈ గాయమే
ముడి వేయకుండా
ముగిసింది నాడే
ఈ ప్రేమ అధ్యాయమే

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..  


4 comments:

వినసొంపుగా ఉంది పాట.

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు..

ట్యూన్ హాంటింగ్ గా ఉంది..

అవును శాంతి గారు పదే పదే గుర్తొచ్చే ట్యూన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.