గురువారం, ఆగస్టు 30, 2018

వెన్నెలా.. ఓ వెన్నెలా..

నీవెవరో చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నీవెవరో (2018)
సంగీతం : ప్రసన్ 
సాహిత్యం : శ్రీజో
గానం : సిద్ శ్రీరామ్

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..


మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ


ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ


ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ
వెన్నెలా.

4 comments:

ఆది యే రోల్ చేసినా మా అందరికీ ఇష్టమండీ..నైస్ సాంగ్..

అవును శాంతిగారు నాకు కూడా నచ్చుతాడు ఆది పినిశెట్టి తన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

నాకు కూడా నచ్చుతాడండి. ఆది ఈజ్ ఏ ఫైన్ ఏక్టర్.

అవును నరసింహరావు గారు నో డౌట్ హీ ఈజ్ ఏ ఫైన్ యాక్టర్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.