శనివారం, ఆగస్టు 25, 2018

సంజాలీ సంజాలీ...

కణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కణం (2018)
సంగీతం : శామ్ సి.ఎస్.
సాహిత్యం : కృష్ణ మదినేని
గానం : అరవింద్ శ్రీనివాస్, అను ఆనంద్

నిను చూసి ఎన్నెలంతా
అలిగెళ్ళిపోదా ఇల్లా
నీ రేడు ఈడే పిల్లా 

నా కలా కథా నువ్వూ
నా జగం సగం నువ్వూ

నాలోన నువ్వు
నా ముందు నువ్వూ
నా శ్వాసలోనా నువ్వూ

సంజాలీ సంజాలీ
నువ్వేలే నా రంగోలీ
సంజాలీ సంజాలీ
నీతోనే నా రంగేళీ
నా వరము నీవనీ

నిను చూసి ఎన్నెలంతా
అలిగెళ్ళిపోదా ఇల్లా
నీ రేడు ఈడే పిల్లా 

కౌగిలై చిరు కౌగిలై
నీ ప్రేమలే కురిసే
ఊపిరై నీ ఊపిరై
నా శ్వాసలో కలిసే

నా కన్నుల్లోనా దాచుకున్న మెరుపా
నా గుండెల్లోనా మోగుతున్న పిలుపా

నాదన్న లోకమే నీదనీ

సంజాలీ సంజాలీ
నువ్వేలే నా రంగోలీ
సంజాలీ సంజాలీ
నీతోనే నా రంగేళీ
సంజాలీ సంజాలీ
నువ్వేలే నా రంగోలీ 


2 comments:

హాంటింగ్ సాంగ్..వింటుంటే తెలీని భయం..బరువు..

బహుశా సినిమా థీమ్ గుర్తురావడంవల్ల అలా అనిపిస్తుండి ఉండచ్చు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.