శనివారం, ఆగస్టు 04, 2018

నాలో చిలిపి కల...

లవర్ చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు, పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లవర్ (2018)
సంగీతం : సాయి కార్తీక్  
సాహిత్యం : శ్రీమణి
గానం : యాజిన్ నిజార్

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

ఎంత ఉప్పెనో నాలోన
ఎంత చప్పుడో గుండెలోన
చెప్పమంటే ఎన్ని తిప్పలో
చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా

నీకు నాకు మధ్య దూరమైనా
లెక్క వేస్తే ఒక్క అడుగేనా
ఒక్క అడుగులో జీవితం దాగినట్టు
దాటలేకపోతున్నా

ప్రేమనే రెండక్షరాలతో
నీకు నాకు మధ్యనే వంతెనేయనా
నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ
ప్రేమలేఖ నీకు రాయనా

నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని
నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని

నాలో చిలిపి కల నీలా ఎదురైందా
ఏదో వలపు వల నన్నే లాగిందా
గుండెలో ఈ ఊహలేమిటో
చూపలేని దాచలేని అల్లరిలా
తియ్యని ఈ వేదనేమిటో
మాటలే మోయలేని మౌనంలా

నిసని గరిస నిసని గరిస
నిసని గరిస నిసనిపమగమపని

2 comments:

పాపం రాజ్ తరుణ్ కి ఓ హిట్ వస్తే బావుణ్ణు..నైస్ సాంగ్..

అవును శాంతిగారు కానీ ఈ సినిమా కూడా అంతగా హిట్ అయినట్లు లేదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.