శుక్రవారం, ఆగస్టు 10, 2018

ఆగి ఆగి సాగె మేఘమేదో...

ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఈ నగరానికి ఏమైంది (2018)
సంగీతం : వివేక్ సాగర్
సాహిత్యం : కృష్ణకాంత్   
గానం : అనురాగ్ కులకర్ణి, మనీషా ఈరబత్తిని   

ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో
నన్ను తాకెనా ఒక్కసారి
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలెనా

ముందులేని ఊహలేవొ
రాలెను చినుకులాగా
అంతసేపు ఊపిరాగగా
ఆ ఆపైనె మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయే క్షణం

ఓపలేని వేసవేదొ వేలు తాకగా
ఓ కాగితాన నేను రాయగ అదే క్షణాన

ఇదేది ముందు చూడనంత
కన్నుల్లో సంబరంల
మరెంత ఉన్న చాలనంత
బంధించే పంజరంలా
నిశీధి దారిలోన యెండె
మొఖాన్ని తాకుతూనే ఉందే
ముందే రాగరూపం
నాపైన ఓ పూల వాన
ఆ చూపేనా ఓ
ఆపేన నే తీసుకోగ ఊపిరైన
ఓసారే వచ్చిందే
నా గుండెలోకి గుండెపోటులా

హో ఆపైనె మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం
నిజం అయే క్షణం

రమా రమి జీవితం అమాంతమే మారె
స్నేహం అనే మారుతం ఇటేపుగా వీచె
మీరు మెల్లంగ నీవు అయ్యెన ఇంకేదైన పేరుందా
కాలమేమొ వేడుకున్నా ఆగదు వేళ్ళమీద వీగిపోగా
నీ తోడులేక కాస్తైన కదలదు
తానుంటె అంతేలే ఇంకేదీ గురుతు రాని వేళలో

పోతోంది తరిగే దూరం మా జంట నడుమా
పెంచావు ఎదలో వేగం ఏ.. ఏ..
ఔతోంది త్వరగా గారం నీకంట పడినా
తెంచావు దిగులు దారం నీవే

ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో
నన్ను తాకెనా ఒక్కసారి
ఓ నేల వీడి కాళ్లు నింగిలోకి తేలెనా

ఓ అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
బాధె చేరె వీలింక లేనే లేదే
తోడే ఉంటే మేలే
అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
నేడే తీసే రాగాలు మేలే మేలే
వచ్చే లేని ప్రేమే

2 comments:

ఈ పాట ఇంతవరకూ వినలేదండి..బావుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.