శనివారం, ఆగస్టు 11, 2018

ఎగిరెనే మనసు సీతాకోకలాగా...

@నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : @నర్తనశాల (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : మహతి స్వరసాగర్, సమీర భరధ్వాజ్

హా ఎగిరెనే మనసు సీతాకోకలాగా
ఎగిరెనే ఎపుడు లేదిలాగా
నువ్విచ్చిన రెక్కల వల్లేగా
చుక్కల్లో విహరిస్తున్నాగా..

మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
మెరిసెనే మైమరచిపోయేలాగా    
నువ్వద్దిన రంగుల వల్లేగా
సరికొత్తగ కనిపిస్తున్నాగా

తొలిసారి పెదవి గమ్మంలో
చిరునవ్వే అడుగుపెట్టింది
కడదాకా ఉండిపోతే బాగుండనిపిస్తోంది

తొలిసారి గుండెసడి లోకి
అలలాంటి అల్లరొచ్చింది
ప్రతిసారి కావాలంటూ అడగాలనిపిస్తుంది

 
ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

  ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే

  
చల్లగా చిరుగాలై చుట్టేశావుగా హో..
మెల మెల్లగా సెగలోకీ నెట్టేశావుగా హో..
నాలో నే నవ్వేస్తున్నా నాకై నే వెతికేస్తున్నా
నీలాగే కనిపిస్తున్నా హయ్యాయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందే లేదు
తొలిసారి కావాలందీ నిన్నేలే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే 


4 comments:

నాగశౌర్య మూవీ కదా..వెయిటింగ్..

అవునండీ తన స్క్రిప్ట్ సెలక్షన్ బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

చాలా బాగుంది పాట.

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.