ఈ సినిమా స్టిల్స్ చూసిన వారెవరైనా "నాగ్ ఈజ్ ఏజింగ్ లైక్ ఫైన్ వైన్" అని అనుకోకుండా ఉండలేరేమో. నాగ్ అండ్ నానీ కాంబినేషన్ లో త్వరలో విడుదలవనున్న "దేవ్ దాస్" చిత్రం లోని ఒక వింటేజ్ ఫీల్ తెప్పించే పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవ్ దాస్ (2018)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య
వారూ వీరూ అంతా చూస్తూ ఉన్నా
ఊరూ పేరూ అడిగెయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకున్నా
ఏ మాటా పైకి రాకా
మనసేమో ఊరుకోకా
ఐనా ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేకా
ఏదేదో అయిపోతున్నా
పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా
వారూ వీరూ అంతా చూస్తూ ఉన్నా
ఊరూ పేరూ అడిగెయ్యాలనుకున్నా
జాలైనా కలగలేదా
కాస్తైనా కరగరాదా
నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తరుముతున్నా
పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా
తెలియలేదా సూచనా
ఇంతకీ నీ యాతనా
ఎందుకంటే తెలుసునా
ఇదీ అనేది అంతు తేలునా
పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా
ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పురవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్భుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్టదిక్కులా ఇలా వలేసి వుంచినావే
వచ్చి వాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్ళకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి చూపవేమి బాలా..
పడుచందం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అల్లా పడిపోక పోతే
ఏం లోటో ఏమొ ఖర్మా
2 comments:
"నాగ్ ఈజ్ యేజింగ్ లైక్ ఫైన్ వైన్"..బావుందండీ పోలిక..
థాంక్స్ ఫర్ ద కామేంట్ శాంతి గారు.. :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.