సోమవారం, ఆగస్టు 13, 2018

అడిగే హృదయమే అడిగే...

అభిమన్యుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభిమన్యుడు (2018)
సంగీతం : యువన్ శంకర్ రాజా  
సాహిత్యం :
గానం : దీపక్, శ్రీవర్ధిని

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా
అడుగే తెలిపెలే అడుగే
నీ వైపె నడిచే పరుగులేంటో
వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటూ ఇలా

 
కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
ఎంతో అందమైన లోకం లోకి
నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే


నన్నే వెంటాడే నీ నవ్వే
మదే ముద్దాడే నీ ఊహే
లోలో తారాడే నీ ఆశే
ఇలా నీ వైపే లాగేనే

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా
అడుగే తెలిపెలే అడుగే
నీ వైపే నడిచే పరుగులేంటో
వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే

అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో
తెలుపమంటు ఇలా


5 comments:

విశాల్ సినిమాలు బాగుంటాయి సార్.పాట కూడా బాగుంది.

యెప్పుడొచ్చిందండి ఈ మూవీ..పాట బావుంది..

ఈ మధ్యే వచ్చింది శాంతి గారు.. సినిమా కూడా బావుంటుందండీ సైబర్ క్రైమ్స్ మీద మంచి ఎవేర్నెస్ వచ్చేలా తీశాడు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజ్యలక్ష్మిగారు. మొదట్లో నాకు అంతగా నచ్చేవి కాదండీ ఈ మధ్య కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్కుంటున్నట్లున్నాడు విశాల్.



అడిగెను హృదయంబడిగెను
అడుగుల చప్పుడడిగె సఖి యా యడిగెనుగా
నొడిచేరగ నానందము
వడివడిగా రావె నన్ను వరదై తాకన్ !




జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.