భరత్ అనే నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భరత్ అనే నేను (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : యాజిన్ నిజార్, రీట
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
అయ్యారె అన్నివైపులా నన్నల్లుకుంటే నీకలా
అందాల ప్రేమ దీవిలా అయ్యా కదా
చెయ్యందుకున్న చెయ్యిలా
రమ్మంటె నువ్వు నన్నిలా
వందేళ్ళ పూల సంకెలై వస్తా పదా..
(ప్రపంచమేలు నాయక
ఇదేగ నీకు తీరిక
మనస్సు దోచుకుంది నీ పోలికా..
పదే పదే పని అని
మరి అలాగ ఉండక
పెదాల తీపి చూడగా రా ఇకా)
దరికి చేరవె సోకుల హర్మోనికా
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఆ సూరిడుతోటి మంతనాలు చెయ్యన
మా..టలాడి చందమామ మనసు మార్చన
నా రోజుకున్న గంటలన్ని పంచన నీ కోసం
ఓ విమానమంత పల్లకీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతొ జర్నీ చెయ్యన
రోదసి ని కాస్త రొమాంటిక్ గ మార్చన నీ కోసం
మెరుపు తీగల హరాలల్లి
సెకనుకొకటి కానుక చెయన
వానవిల్లుని ఉంగరమల్లె మలచి
నీ కొనవేలుకి తొడిగేయ్ నా
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఒలె.. ఒలె.. ఒలె.. వసుమతి వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి
ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకన
అందులోనె చిన్ని పూల మొక్క నాటన
దానికేమో నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో..
నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెళ్ళోన దాన్ని లాకెట్ అల్లె వెయ్యనా
మా..టి మాటి కది ముద్దు ముచ్చటాడగా గుండెతో
ప్రతొక జన్మలో ముందే పుట్టి ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మ గారికి రిక్వెస్ట్ పెట్టి మరొక లోకం మనకై అడిగేయ్ నా
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఓలే ఓలే ఓలే వసుమతి వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి
2 comments:
ఈ పాట వినగా వినగా చాలా బావుందనిపిస్తుంది..
మధ్యలో ప్రయత్నించిన రాప్ తప్ప పాటంతా బావుంటుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.