సోమవారం, నవంబర్ 30, 2015

జయశంభో శివశంకర..

కార్తీక సోమవారం నాడు ఈ సర్వేశ్వరుడుని స్మరించుకుంటూ భానుమతి గారు గానం చేసిన ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పల్నాటి యుద్ధం(1966)
సంగీతం : గాలిపెంచల నరసింహరావు
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : భానుమతి

జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర
జగధీశా స్వయంభో ప్రభో
జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

గిరిజానాధ నీపాదదాసులే హరివాణీశ లోకేశులు
గిరిజానాధ నీపాదదాసులే హరివాణీశ లోకేశులు
నిరతమ్ము మహాభక్తితో ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నిరతమ్ము మహాభక్తితో నిను సేవించి నిలిచేరయా

జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

ఈ వర్ణ సమాచారసాధన మత్తకోపాలతాపాలకు
ఈ వర్ణ సమాచారసాధన మత్తకోపాలతాపాలకు
గురిగాక విరాజిల్లగా మా పల్నాడు కాపాడుమా
మా పల్నాడు కాపాడుమా

జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర
జగధీశా స్వయంభో ప్రభో
జయశంభో శివశంకర ,జయశంభో శివశంకర

ఆదివారం, నవంబర్ 29, 2015

నవ్వింది రోజా పూదోటలో..

ఇళయరాజా సంగీతంలో వచ్చిన అనురాగ సంగమం చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అనురాగ సంగమం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : గోపీ
గానం : బాలు

నవ్వింది రోజా పూదోటలో
ఆ స్నేహ రాగం ఏ జన్మదో
వలపు వాన ముంగిట కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం ప్రతి రోజూ పాడేమూ

నవ్వింది రోజా పూదోటలో

నా గుండె గుడిలో నువు కొలువై
చిననాటి తోడై నిలిచితివే
నీవే లేక నేనే శూన్యం
పాడే గీతం నా చెలికోసం
నా పాట నీకు వినిపించదా
నాటి వలపులు నాటి తలపులు
నాలోని రాగమై పలికెనే
నా కంటి వెన్నెలై విరిసెనే
నా గొంతు పల్లవించెనే
నువ్వు కన్న కలలు పండెనే

నవ్వింది రోజా పూదోటలో

నీ ప్రేమ బంధం మది కదలీ
నా గుండె బరువై రగిలినదే
పాటకు నీవే స్వరమైనావే
కంటికి మాత్రం కరువైనావే
రేపగలు నాలో నీ ధ్యానమే
రాగదీపం నువ్వు
రాజ మేఘం నీవు
కోరేవు నువ్వు రమ్మనీ
రాలేకపోతినే రాలేదనీ
నా తప్పు మన్నింతువో
నన్ను మరల ఆదరింతువో

నవ్వింది రోజా పూదోటలో
వలపు వాన ముంగిట కురిసి పరవశించెనూ
వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనూ
ఒక రాగం అనురాగం ప్రతి రోజూ పాడేమూ
నవ్వింది రోజా పూదోటలో
ఆ స్నేహ రాగం ఏ జన్మదో 


శనివారం, నవంబర్ 28, 2015

రాగం.. రాగం.. ఇదేమి రాగం..

చక్రవర్తి గారు స్వరపరచిన పక్కింటి అమ్మాయి చిత్రంలోని ఓ సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ??
గానం : సుశీల 

రాగం రాగం ఇదేమి రాగం..
కూని రాగం
తాళం తాళం ఇదేమి తాళం..
తకధిమితా తకధిమితా తాళం..
ఆడింది ఆట పాడింది పాట
ఆనందమానందం..

రాగం రాగం ఇదేమి రాగం..
కూని రాగం
తాళం తాళం ఇదేమి తాళం..
తకధిమితా తకధిమితా తాళం..


నాపేరే మల్లెమొగ్గ
నా బుగ్గన సిగ్గుమొగ్గా
విరిసిందీ కొత్తగా మత్తుగా
పండగొచ్చెనా పబ్బమొచ్చెనా
ఏ రోజూ లేని తొందర ఈవేళా.
సంతోషమంతా సరాగమైతే
సంబరాల సందడంటా
సంకురాత్రి పండగంటా
చిన్నదేమో ఒక్కతంటా
వయసు మీద ఉన్నదంటా
ఇంకేమి చెప్పేది హా
ఇంకేమి చెప్పేది

రాగం ఊహూ..
ఇదేమి రాగం.. కూని రాగం
తాళం తాళం ఇదేమి తాళం..
తకధిమితా తకధిమితా తాళం..


అద్దంలో నాకు నేనే
ముద్దొస్తూ ఉన్నవేళ
చూడంగా ముచ్చటవుతున్నదీ
కన్నె సోకులూ సన్నజాజులూ
మాటల్లో చెప్పలేని అందాలూ
ఇదేమి సొగసో ఇదేమి వయసో
ఉన్నచోట ఉండనీదూ
ఉన్నమాట చెప్పనీదూ
ఊరుకుంటె ఒప్పుకోదూ
చెప్పుకోక తప్పలేదు
మనసులో మాట నా మనసులో మాట

రాగం ఊహూ.. ఇదేమి రాగం..
కూని రాగం
తాళం తాళం ఇదేమి తాళం..
తకధిమితా తకధిమితా తాళం..

రాగం రాగం ఇదేమి రాగం..
కూని రాగం
తాళం తాళం ఇదేమి తాళం..
తకధిమితా తకధిమితా తాళం.. 
 

శుక్రవారం, నవంబర్ 27, 2015

చుక్కలతో చెప్పాలని...

ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం కోసం కె.వి.మహదేవన్ గారి సంగీతంలో దేవులపల్లి వారు రచించిన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

చుక్కలతో చెప్పాలని.. ఏమని
ఇటు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
 
 
చుక్కలతో చెప్పాలని.. ఏమని
ఇటు చూస్తే తప్పని.. ఎందుకని..
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని

చెదిరే ముంగురులు కాటుకలు
నుదురంతా పాకేటి కుంకుమలు
చెదిరే ముంగురులు కాటుకలు
నుదురంతా పాకేటి కుంకుమలు
సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
చిగురాకుల గాలులే ఒదిగొదిగేను
 
ఇక్కడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని.. 
 
చుక్కలతో చెప్పాలని.. ఏమని
ఇటు చూస్తే తప్పని.. ఎందుకని..

ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..

మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
మిసిమి పెదవి మధువులు తొణికేనని
మిసిమి పెదవి మధువులు తొణికేనని
పసికట్టే తుమ్మెదలు ముసిరేనని
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని
 
 
చుక్కలతో చెప్పాలని.. ఏమని
ఇటు చూస్తే తప్పని.. ఎందుకని..

ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..


గురువారం, నవంబర్ 26, 2015

చిలకా గోరింక...

సాలూరి వారి స్వర సారధ్యం వహించిన చెంచులక్ష్మి చిత్రంలోని ఓ సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : చెంచులక్ష్మి (1958)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల,జిక్కి

చిలకా గోరింక కులికే పకాపకా
నేనే చిలకైతె నీవె గోరింక రావా నావంక
చిలకా గోరింక కులికే పకాపకా
నీవే చిలకైతె నేనే గోరింక రావా నావంక

చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలు కన్నట్టి కలిమి లభించెనే
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలు కన్నట్టి కలిమి లభించెనే
మనసే నిజమాయె తనువులు ఒకటాయె
మదిలొ తలంపులే తీరె తీయగా మారె హాయిగా

చిలకా గోరింక కులికే పకాపకా
నేనే చిలకైతె నీవే గోరింక రావా నావంక

కలికి నీవిలా ఎదుట నిలాబడ
పలుకే బంగారం వొలికే వయ్యారమే
కలికి నీవిలా ఎదుట నిలాబడ
పలుకే బంగారం వొలికే వయ్యారమే
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలిసి విహారమే చేద్దాం హాయిగా నీవె నేనుగా

చిలకా గోరింక కులికే పకాపకా
నీవే చిలకైతె నేనే గోరింక రావా నావంక
చిలకా గోరింక కులికే పకాపకా
నేనే చిలకైతె నీవె గోరింక రావా నావంక

బుధవారం, నవంబర్ 25, 2015

మొన్న నిన్ను చూసాను...

పెళ్ళి కాని పిల్లలు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచూకందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్లి కాని పిల్లలు (1961)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

మొన్న నిన్ను చూసాను నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి వెర్రివాడనయినాను
మొన్న నిన్ను చూసాను నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి వెర్రివాడనయినాను


లోకానికి చల్లని గాలి నా పాలిట వడగాలి ఓ
లోకానికి చల్లని గాలి నా పాలిట వడగాలి
పగలే పెనుచీకటి కాగా నీ మోమే జాబిలి
తాళలేను జాలి తలచి నీ వానిగ చేయాలి

మొన్న నిన్ను చూసాను నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి వెర్రివాడనయినాను


కనులు తెరచి జగమే మరచి కలలు వేయి కంటాను
కనులు తెరచి జగమే మరచి కలలు వేయి కంటాను
కలలోను మేను మరచి చెలి మాటే వింటాను
నాలో కల తీయని బాధ ఎలా తెలుపుకుంటాను

మొన్న నిన్ను చూసాను నిన్న మనసు కలిపాను
నేటినుండి నిన్నే తలచి వెర్రివాడనయినాను





మంగళవారం, నవంబర్ 24, 2015

ఈ రోజుల్లో పడుచువారు..

ఈ రోజుల్లో.. అంటూ ఆ రోజుల్లో పాడినా ఈ రోజులకీ వర్తించే ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, కోరస్

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో.. ఓ ఓ ఓ ...

తాజా తాజా మోజుల కోసం తహతహలాడుతు ఉంటారు
తాజా తాజా మోజుల కోసం తహతహలాడుతు ఉంటారు
పొట్టి షర్ట్లతో టైటు ప్యాంట్లతో లొట్టి పిట్టలవుతుంటారు
మెప్పులు కోసం.. అప్పులు చేసి
మెప్పులు కోసం అప్పులు చేసి తిప్పలపాలవుతుంటారు

ఈరోజుల్లో.. ఓ ఓ ఓ ...

రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీటేస్తారు
రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీటేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్నది కాస్తా.. చెయ్యి విసిరితే
ఆ చిన్నది కాస్త చెయ్యి విసిరితే చెప్పకుండా చెక్కేస్తారు

ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈరోజుల్లో.. ఓ ఓ ఓ .....

పాఠాలకు ఎగనామం పెట్టి మ్యాటిని షోలకు తయ్యారు
పాఠాలకు ఎగనామం పెట్టి మ్యాటిని షోలకు తయ్యారు
పార్టీలంటూ పికినికులంటూ పుణ్యకాలము గడిపేరు
పరీక్ష రోజులు.. ముంచుకురాగా
పరీక్ష రోజులు ముంచుకురాగా 
తిరుపతి ముడుపులు కడతారు

ఈరోజుల్లో ... పడుచువారు గడుసువారు
సహనంలో కిసానులు సమరంలో జవానులు
ఈరోజుల్లో.. ఓ ఓ ....

ఆడపిల్లలను గౌరవించితే ఆత్మ గౌరవం పెరిగేను
సమరసభావం కలిగిన నాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళ కోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని మరవద్దు
ఆ భారం మనదని మరవద్దు... మనదని మరవొద్దు



సోమవారం, నవంబర్ 23, 2015

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

కార్తీక సోమవార పర్వదినం సందర్బంగా ఆ లయ కారుడ్ని స్తుతించుకుంటూ సువర్ణసుందరి లోని ఈ చక్కని పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సువర్ణసుందరి(1957)
సంగీతం : ఆదినారాయణరావ్
రచన : సముద్రాల
గానం : సుశీల, కోరస్

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓం...నమశ్శివాయః సిద్ధం నమః ఓం...
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
దేవాపుర సంహార!..ధీర నటశేఖరా
త్రాహి కరుణాకరా..పాహి సురశేఖరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..ఆ ఆ ఆ....
శంభోహరా..వినుతలంబోధరా..
అంబావరకావరా..
వరమీయరా..గౌరి..వరసుందరా
గౌరి..వరసుందరా..
నిన్నే కని మేము కొలిచేము..గంగాధరా
దేవ...గంగాధరా...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

జగదీశ్వరా పాహి పరమేశ్వరా..
జగదీశ్వరా పాహి పరమేశ్వరా..

ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..

నడిపెను సుందర నటనకు జతులిడ
నందియ మార్దళనాదమే..
మధురాతిమధుర శృతి గీతమే...
తధిమి..తధిమి ధిమితైతై తయ్యని
తాండవమాడేను..పాదమే..
మది సేవించిన సమ్మోదమే..
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా
జగంబులా ఏలికా..శివకామ సుందర నాయకా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
ప్రమధులు పాడ..ఫణిగణ మాడ..
పార్వతి సయ్యాడా..
మౌనివరుల్ నిను మనసార..
గని పారవశ్యంబున కొనియాడా..


ఆదివారం, నవంబర్ 22, 2015

అలకలకు లాలీజో...

అల్లరి పిల్ల చిత్రం కోసం విద్యాసాగర్ గారు స్వర పరచిన ఓ హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అల్లరిపిల్ల (1992)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : 
గానం : మనో, లలిత

అలకలకు లాలీజో కులుకులకు లాలీజో.. 
అలకలకు లాలీజో కులుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాకా
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..

జత కలిసినదొక తార జతులను పలుకు సితారా 
మతి చెడు సొగసులు ఔరా.. వెతికిన దొరకవులేరా.. 
స్వరాలలో కోయిలమ్మ సరాగమే ఆడగా 
పదే పదే కూనలమ్మ పదాలుగా పాడగా 
అండకోరి వచ్చెనమ్మ కొండపల్లి బొమ్మ 
గుండెలోన విచ్చెనమ్మ కొండమల్లి రెమ్మ 
పండులాగ దిండులాగ చెండులాగ ఉండిపోగ 
పండుగాయె పండు వెన్నెల.. 

ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
ఝంచకు చకు ఝంచకు.. 
ఝంచకు చకు ఝంచకు.. 

ఉరుకుల పరుగుల జాణ దొరికిన సిరుల ఖజానా 
తొలకరి అలకలలోనా చిలికెను వలపులు మైనా 
మరీ ఇలా మారమైతే ఫలించునా కోరిక 
కథేమిటో తేలకుంటే లభించునా తారకా 
అందమంత విందు చేసె కుందనాల కొమ్మ 
ముందుకాళ్ళ బంధమేసే చందనాల చెమ్మ 
అందరాని చందమా అందుకూన్న పొందులోన 
నందనాలు చిందులెయ్యగా..

ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు.. 
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
కులుకులకు లాలీజో.. తళుకులకు లాలీజో..
కలికి చిలక.. కలత పడక..
కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాకా
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు..  
ఆహా.. ఝంచకు.. ఆహా.. ఝంచకు.. 

 
   

శనివారం, నవంబర్ 21, 2015

తీయని వెన్నెల రేయి...

బాలరాజు చిత్రంలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాలరాజు (1945) 
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య 
గానం : వక్కలంక సరళ 

తీయని వెన్నెల రేయి 
తీయని వెన్నెల రేయి 
ఎదబాయని తిమ్మెర హాయి 
ఓ రధ శాయి
నటనమే బ్రతుకోయి

తీయని వెన్నెల రేయి 
ఎదబాయని తిమ్మెర హాయి 
ఓ రధ శాయి
నటనమే బ్రతుకోయి

ఊగే పూలలోనా 
ఊగే పూలలోనా మును సాగే అలలోనా 
ఊగే పూలలోనా మును సాగే అలలోనా
చెలరేగె గాలిలో నా కాలి మువ్వలలో
చెలరేగె గాలిలో నా కాలి మువ్వలలో
కదలికే కరువాయే నటనమే బ్రతుకోయి
కదలికే కరువాయే నటనమే బ్రతుకోయి

ముల్లు భామ ఒడిలో నడలో సుడులు వారీ
ముల్లు భామ ఒడిలో నడలో సుడులు వారీ 
వనమయూరినే మీరి తను ధీర అగునే
వనమయూరినే మీరి తను ధీర అగునే
దరికిక రావోయి నటనమే బ్రతుకోయి
నాదరికే రావోయి నటనమే బ్రతుకోయి

 

శుక్రవారం, నవంబర్ 20, 2015

హైలో హైలేసా...

భీష్మ చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భీష్మ(1962)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : జమునారాణి

హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ
 
ఓహోహై - ఓ హోహై
 
నదిలో నా రూపు నవనవ లాడినది,
మెరిసే అందములు మిలమిల లాడినవి
మెరిసే అందములు మిలమిల లాడినవి 
వయసూ వయారమా - పాడినవి పదేపదే  
వయసూ వయారమా - పాడినవి పదేపదే  
 
హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ
ఓహోహై - ఓ హోహై..
  
ఎవరో మారాజూ.. 
ఎవరో మారాజు.. ఎదుట నిలిచాడు 
ఎవో చూపులతో సరసకు చేరాడు
ఎవో చూపులతో సరసకు చేరాడు
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి 
మనసే చలించునే మాయదారి మగాళ్ళకి  
 
హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ
ఓహోహై - ఓ హోహై..

గురువారం, నవంబర్ 19, 2015

సంగమం.. సంగమం..

కోడెనాగు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కోడెనాగు (1974)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : మల్లెమాల
గానం : ఘంటసాల, సుశీల

సంగమం.. సంగమం..
అనురాగ సంగమం..
జన్మ జన్మ ఋణానుబంధ సంగమం..

సంగమం.. సంగమం ఆనంద సంగమం
భావ రాగ తాళ మధుర సంగమం

సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం..
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం..
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం..

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం..


సంగమం.. సంగమం..
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


నింగి నేల.. నింగి నేల
ఏకమైన నిరుపమాన సంగమం

నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం..
ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం
నిలిచిపోవు సంగమం

సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం


జాతికన్న నీతి గొప్పది.. 
మతము కన్న మమత గొప్పది.
జాతికన్న నీతి గొప్పది.. 
మతము కన్న మమత గొప్పది...
మమతలు.. మనసులు ఐక్యమైనవి...
ఆ ఐక్యతే మానవతకు 
అద్దమన్నవీ.. అద్దమన్నవీ..

సంగమం... సంగమం..
అనురాగ సంగమం.. ఆనంద సంగమం..
 

బుధవారం, నవంబర్ 18, 2015

ఉదయకిరణ రేఖలో..

చక్రవర్తి గారి స్వరకల్పనలో శ్రీవారి ముచ్చట్లు చిత్రంలో వచ్చిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, జానకి

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
పాడిందీ... ఒక రాధిక... పలికిందీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పు నాట్యాలు నాట్యభారతి పాదాల పారాణి అద్దగా
కాశ్మీర అందాలు బాలభారతి నుదుట తిలకాలు దిద్దగా
పురివిప్పు నాట్యాలు నాట్యభారతి పాదాల పారాణి అద్దగా
 
అడుగుల అడుగిడి స్వరమున ముడివడి
అడుగే పైబడి మనసే తడబడి
మయూరివై కదలాడగా... వయ్యారివై నడయాడగా
ఇదే...  ఇదే...  ఇదే...  నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

పయనించు మేఘాలు నిదురించు సృష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా
పయనించు మేఘాలు నిదురించు సృష్టినే మేలుకొలుపగా
రవళించు మువ్వలు నటరాజు ఆశీస్సుకై హారతివ్వగా
స్వరమున స్వరమై పదమున పదమై
పదమే స్వరమై స్వరమే వరమై
దేవతవై అగుపించగా... జీవితమే అర్పించగా
ఇదే... ఇదే... ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో
పాడిందీ... ఒక రాధిక... పలికిందీ.. రాగ మాలిక
ఇదే.. ఇదే.. ఇదే... నా అభినందన గీతికా

ఉదయకిరణ రేఖలో... హృదయ వీణ తీగలో

మంగళవారం, నవంబర్ 17, 2015

పడిన ముద్ర చెరిగిపోదురోయ్..

కె.వి.మహదేవన్ గారి సంగీతంలో వచ్చిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : అద్రుష్టవంతులు(1969)
సంగీతం : కె.వి.మహాదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

ఓహోహో..హ్హో..హ్హో..ఒహో..హ్హో..హ్హో..
పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్..

పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

మచ్చికైన పాలపిట్టనూ..ఓ..రాజా..నా..రాజా
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ..
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ..
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్..
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్..ఔరౌర..
రొమ్ముమీద పుట్ట మచ్చనోయ్..

ఒహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

డేగలాగ ఎగిరిపోతివోయ్..
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్..
డేగలాగ ఎగిరిపోతివోయ్..
నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్
పాలలోన తేనె కలిసెనోయ్..ఓ..రాజా..నా..రాజా
ఆ..ఆ..ఆ..పాలలోన తేనె కలిసెనోయ్
నేడే మన పరువానికి పండుగైనదోయ్..

ఒహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ

సోమవారం, నవంబర్ 16, 2015

మహాదేవ శంభో..

ఈ రోజు కార్తీక సోమవారం సంధర్బంగా ఆ పరమ శివుడ్ని కీర్తించే ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భీష్మ (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం: సుశీల

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ ఓ ...
మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
మొరాలించి పాలించ రావా..

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓ..ఓ


జటాఝూటధారి.. శివా.. చంద్రమౌళీ..
నిటాలాక్ష.. నీవే సదా నాకు రక్ష
జటాఝూటధారి.. శివా.. చంద్రమౌళీ..
నిటాలాక్ష.. నీవే సదా నాకు రక్ష..
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
ప్రసన్నమ్ము కావా.. ప్రసన్నమ్ము కావా

మహాదేవ శంభో..ఓ..ఓ
మహాదేవ శంభో..ఓఓ..


మహేశా.. గిరీశా.. ప్రభో దేవ దేవా..
మొరాలించి పాలించ రావా
మహాదేవ శంభో..
శివోహం... శివోహం..
శివోహం... శివోహం..

 

ఆదివారం, నవంబర్ 15, 2015

వేయిపడగల నీడలో...

మిత్రులకు నాగుల చవితి శుభాకాంక్షలు ఈ సంధర్బంగా దేవి చిత్రంలోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : స్వర్ణలత

వేయిపడగల నీడలో రేయిపగలు
జగములన్నియు కాపాడు జనని నీవు
లోకకళ్యాణకారిణీ శ్రీకరి
ఇల సకలజనులకు ఒసగవే 
శాంతిసుఖము

నాలుగు వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా
పదునాలుగులోక నివాసులు నాగులచవితికి నిన్నే కొలువగా
భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా
భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా
అర్చన చేయుచు హారతినీయగా గైకొన రావే దేవీ
దేవీ....నాగదేవీ....దేవీ....నాగదేవీ
దేవీ....నాగదేవీ....దేవీ....నాగదేవీ
దేవీ....నాగదేవీ....దేవీ....నాగదేవీ


శనివారం, నవంబర్ 14, 2015

అడిగానని అనుకోవద్దు...

మిత్రులకూ చిన్నారులకూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వడం సులువుగా కనిపించే కష్టమైన పని. ఈ చిన్నారి ఓ స్వామీజీకి సంధించిన ప్రశ్నలు దానికి ఆయన సమాధానాలు మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాలరాజు కథ (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, సుశీల

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు

అది వీధిలోన పడి ఉన్నందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

మనిషికి ఒక పెళ్ళే చాలంటూ
దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ
దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
 
లోకులు చూచి తరించుటకు
లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా  వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా

సర్వవ్యాపి నారాయణుడు
సర్వవ్యాపి నారాయణుడు
ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా
తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా

ఆఁ అట్టా రండి దారికి

అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం


శుక్రవారం, నవంబర్ 13, 2015

కన్నులే నీకోసం కాచుకున్నవి...

సాలూరి వారి స్వరసారధ్యంలో వచ్చిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గృహలక్ష్మి (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, భానుమతి

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

 
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి
 
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది 
ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామ వున్నాడు
చందమామ వున్నాడు

 
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

 
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

 

గురువారం, నవంబర్ 12, 2015

చందమామ నేనేలే...

ఇళయరాజా గారి స్వరకల్పనలో తమిళ్ లో సూపర్ హిట్ అయిన "రాజ రాజ చోళన్ నా" పాటకు తెలుగు అనువాదాన్ని ఈ రోజు తలచుకుందాం.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రెండు తోకల పిట్ట (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే ఆకాశవీధిలోన అందాలు నీవెలే
నీలోని సోయగాలు నావేనులే

చందమామ నేనేలే 
నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

నీ కళ్ళలోన ఉంది కర్పూర దీపమే
నిలువెల్ల ఉంది నీలో శృంగారమే
నా శ్వాసలోన ఉంది ఓ ప్రేమ నాటకం
నీ ధ్యాసలోన ఉంది నా జీవితం
నయనాలు రెండు ఉన్నా చూపొక్కటే
పాదాలు రెండు ఉన్న బాటొక్కటే
నా చూపు నీవులే  నీ బాట నేనులే
నా కంటికి నట్టింటికీ ఓ వెలుగులీవే దేవి

చందమామ నేనేలే 
నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

నీ నవ్వులోన ఉంది కార్తీక పౌర్ణమి
నీ హొయలలోన ఉంది వసంతమే
నీ పెదవి కోరి పిలిచె నను పేరంటమే
నీ ఈడు నాకు ఇచ్చె తాంబూలమే
నీ పైట చెంగు చేసె సంకేతమే
నీ పాల పొంగు పాడె సంగీతమే
ఇది ప్రేమ సాగరం ఈదాలి ఇద్దరం
నా ప్రాణమూ నా సర్వమూ ఏనాడు నీవే దేవి

చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే ఆకాశవీధిలోని అందాలు నీవెలే
నీలోని సోయగాలు నావేనులే
చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
నేనే నీవై రావే

బుధవారం, నవంబర్ 11, 2015

ఆడే పాడే పసివాడా...

మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా పెళ్ళి కానుక చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజ
సాహిత్యం : చెరువు ఆంజనేయశాస్త్రి
గానం : సుశీల

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
నా మదిలో నీకు నెలవే కలదూ
నా మదిలో నీకు నెలవే కలదూ
బదులే నాకూ నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు
నిజమైన చాలునురా... ఆ.. ఆ..
నిజమైన చాలునురా

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...

చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
నీ రూపమే ఇంటి దీపము బాబూ
నీ రూపమే ఇంటి దీపము బాబూ
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన
మరివేరే కోరమురా... ఆ.. ఆ..
మరివేరే కోరమురా

ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...




మంగళవారం, నవంబర్ 10, 2015

గులాబీలు పూచేవేళా..

భలే అబ్బాయిలు చిత్రం కోసం ఘంటసాల గారు స్వరపరచిన శ్రీశ్రీ రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భలే అబ్బాయిలు (1969)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, జానకి

గులాబీలు పూసేవేళా కోరికలే పెంచుకో
పసందైన చిన్నదాన్నీ ప్రెమించుకో
గులాబీలు పూసేవేళా కోరికలే పెంచుకో
పసందైన చిన్నదాన్నీ ప్రెమించుకో
గులాబీల నీడలలో ముళ్ళున్నై చూసుకో
ప్రేమంటే మజా కాదులే ఊహించుకో

ఏవేవో కలలే కంటూ మైమరచేవెందుకూ
ఈ లోకం పగబూని పోనీయదు ముందుకు
ఆఆఆఆ...ఆఆఅ...
నాతోడే నీవై ఉంటే కలనిజమై పోవునూ
ముళ్ళన్నీ సిరిమల్లియలై మురిపించునూ

గులాబీలు పూసేవేళా కోరికలే పెంచుకో
పసందైన చిన్నదాన్నీ ప్రెమించుకో
గులాబీల నీడలలో ముళ్ళున్నై చూసుకో
ప్రేమంటే మజా కాదులే ఊహించుకో

పరువాల వాహినిలోనా పడవెక్కి సాగిపో
సరసాలా తెరచాపెత్తి సరదాగా ఆడుకో
ఆఆహాహాహా...ఆఆఆ...ఆఅఅ
పరువాల వాహినిలోనా సుడిగుండాలున్నవీ
పొంచుండీ జీవిత నావను ముంచేనులే

గులాబీలు పూసేవేళా కోరికలే పెంచుకో
పసందైన చిన్నదాన్నీ ప్రెమించుకో
గులాబీల నీడలలో ముళ్ళున్నై చూసుకో
ప్రేమంటే మజా కాదులే ఊహించుకో
ఆఆఆఅ..ఆఆఆఅ...ఆఆఆఆ..ఆఆ.ఆఆ..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.