శనివారం, నవంబర్ 14, 2015

అడిగానని అనుకోవద్దు...

మిత్రులకూ చిన్నారులకూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వడం సులువుగా కనిపించే కష్టమైన పని. ఈ చిన్నారి ఓ స్వామీజీకి సంధించిన ప్రశ్నలు దానికి ఆయన సమాధానాలు మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాలరాజు కథ (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల, సుశీల

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు

అది వీధిలోన పడి ఉన్నందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

మనిషికి ఒక పెళ్ళే చాలంటూ
దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ
దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
 
లోకులు చూచి తరించుటకు
లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం

మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా  వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా

సర్వవ్యాపి నారాయణుడు
సర్వవ్యాపి నారాయణుడు
ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా
తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా

ఆఁ అట్టా రండి దారికి

అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
ఏ రాతికి మొక్కను వచ్చారు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం


2 comments:

ఇందులోదే "మహా బలిపురం..మహా బలిపురం..మహా బలిపురం"..సాంగ్ కూడా చాలా బావుంటుందండి..

అవును శాంతి గారు.. చిన్నపుడు చాలా వినేవాడ్ని ఆ పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.