ఆదివారం, నవంబర్ 01, 2015

చప్పుడైన చేయలేదే..

సత్య సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల (??)
గానం : మనో, స్వర్ణలత 

సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే.. హే..
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే హోయ్..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే..
 
ఓయ్..చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
చేపకళ్ళ చూపులో కోపమెంత చూపినా
నవ్వినట్లు ఉంటాదే నా పిల్లచూడు..నా పిల్లచూడు
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా 
మద్ది మాను తీరునా మొద్దు మాదిరుండినా
ముద్దు గానే ఉంటాడే నా పిల్లగాడు.. నా పిల్లగాడు
సింగమంటి పిల్లగాడు జింక పిల్ల లాంటి నాకు
వంగి లొంగి పోయాడే 

చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
సూడబోతే పూల రేకు పట్ట బోతే పిడిబాకు 
టక్కులెన్నొ నేర్చిందే 
చప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే

హొయ్ ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
ఒక్క మారు అంటాడే గుక్క తిప్పుకోనీడే 
సిగ్గు బుగ్గి చేస్తాడే నా పిల్లగాడు 
నా పిల్లగాడు నా పిల్లగాడు
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
ఎన్ని సెప్పు వింటది నిన్ను తిప్పుకుంటది 
గుట్టు చెప్పనంటుంది నా పిల్ల చూడు
గుమ్మపాల పొంగులో గట్టు దాటు గంగలా 
మతి సెడగొడుతుందీ..

సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
నువ్వు తప్ప నాకు దిక్కు మొక్కు లేదంటు 
ఒట్టేసి చెబుతాడే..
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే 
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
ఏందిరా ఈ గొడవని గుండె చూసుకుంటే 
అక్కడొచ్చి కూర్చుందే..
ఇంత బరువేంటని కళ్ళునులుముకుంటే
రెప్ప చాటునున్నాడే.. 
చప్పుడైన చెయ్యలేదే నా పిల్లగాడు 
చెప్పకుండ చేరినాడే
సప్పుడైన చెయ్యలేదే ఈ పిల్ల సూడు
చెప్పకుండ చేరినాదే.. 
 

3 comments:

Spiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.

చప్పుడైన చెయ్యలేదే అంటూనే మాస్ బీట్ తో స్టెప్స్ వేయించే పాట సుమండీ..

హహహ భలే చెప్పారండీ.. నిజమే మాంచి మాస్ బీట్ సాంగ్ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.