సోమవారం, నవంబర్ 02, 2015

అడగాలనుంది ఒక డౌటుని...

లిటిల్ సోల్జర్స్ చిత్రంలోని ఈ సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
సంగీతం : శ్రీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీ, శ్రీలేఖ, దీపిక, విష్ణు

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు

అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ

ఈ హైటే నాకు ఉంటే 
అమ్మో ఎంత danger
నాక్కూడా మీసముంటే
ఏం చేస్తావు మేజర్
class miss chairలోన నేను కూర్చుంటా
comics class books చేసి చదివిస్తా
స్కూలుకి principal sir నేను అవుతా
All days holidays ఆడుకోండి అంటా
ఎగ్జాంసొస్తే అప్పుడు ఎలా మరీ
మార్కులు కూడా మీరే వేస్తె సరి

అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే

చాలమ్మా ఆటలింకా
కొంచెం ఆగు మమ్మీ
రానంటే వెళ్లిపోతా
నో నో వద్దు డాడీ
ఆటకైనా పాటకైనా ఆఖరంటు లేదా
ఆకలేస్తే అప్పుడైన అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి     
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో

అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే


2 comments:

ఈ పాపని మళ్ళీ యే మూవీ లోను చూడలేదండీ..చాలా క్యూట్ గా ఉంటుంది..ఆ పిక్ లో లానే..

అవును శాంతి గారు తను ఈ ఒక్క సినిమానే చేసింది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.