శక్తికాంత్ కార్తీక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శక్తికాంత్ కార్తీక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, ఆగస్టు 21, 2018

లవ్యూ లవ్యూ...

నేలటిక్కెట్ సినిమాలోని ఒక చక్కని పాటని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేలటిక్కెట్ (2018)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్  
సాహిత్యం : చైతన్య పింగళి
గానం : శ్రీకృష్ణ, రమ్యబెహరా   

విన్నానులే మది సవ్వళ్ళనే
అన్నానులే నను వచ్చేయని
చూశానులే కనుపాపల్లోనే
చెప్పానులే అవి నా ఇళ్ళనీ

ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా
నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

కాదన్నా ఔనన్నా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
దూరంగా నెడుతున్నా
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
అంటూన్నావే లబ్ డబ్ అనీ నాలో నువ్వూ
ఉంటానులే నీ శ్వాసగా నిత్యం నేనూ

లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

ఆకాశం అందేంతా నేలంతా కమ్మేంతా
ఊహల్లాగే వచ్చేయనా నీతో నేను
ప్రాణంలాగా నిండావులే నాలో నువ్వూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ

ఊ కొట్టీ పలికేటీ హృదయము నీకే నజరానా
నిద్దట్టో సలిపేటీ తలపులు నాకే జరిమానా 
 
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ
లవ్యూ లవ్యూ ఐ లవ్యూ లవ్యూ 


గురువారం, ఆగస్టు 09, 2018

కాదని నువ్వంటున్నదీ...

హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హ్యాపీ వెడ్డింగ్ (2018)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్      
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : హేమచంద్ర, శ్రావణభార్గవి  

ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది నిజమేనా

కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..

ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఏంవిన్నావో

ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా
ఏం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా..

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

కోరే.. వరమేదో.. మునుముందే నిలుచుందే
ఇంకా.. కలలేనా.. కనుపాపా
చేరే దరియేదో.. రమ్మంటూ ఎదురైతే
చూస్తూ.. నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా.. ప్రాయం రాలేదా
అడుగేస్తే పడిపోతావా.. పడవే ముందడుగా

ముందూ వెనక  చూడకా.. పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ.. తరిమే దుందుడుకా

ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో
ఏమో.. ఎం కావాలో
తనకీ.. తెలుసో లేదో

నీలో.. నీతోనే.. దోబూచి దొంగాట
నీకే.. నువ్వు దొరికేదెపుడంటా

ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట
ఆలోచిద్దాం అందాక.. తప్పేం లేదంటా

కవ్వించే కయ్యాలతో.. నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది.. మనసుల ముద్దాటా

అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో
అవునా.. అంతేనేమో
అయినా.. ఇంతేనేమో

ఓ.. కాదని నువ్వంటున్నదీ
అవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ..
ఓ.. ఎం కావాలంటున్నదీ
అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా.. ఓఓ..

ఏమో.. ఏమో.. ఏమన్నానో.. ఏమన్నావో
ఏమో.. ఏమో.. ఎం విన్నావో.. ఎం విన్నానో
ఏమో.. ఏమన్నానో
ఏమో.. ఎం విన్నావో.. ఏమో


గురువారం, అక్టోబర్ 26, 2017

హే పిల్లగాడా...

భానుమతి గారిమీద మల్లీశ్వరి సిన్మా మీద ఉన్న ఇష్టాన్ని చూపించుకుంటూ తన హీరోయిన్ కి భానుమతి అని పేరు పెట్టుకోవడమే కాక మల్లీశ్వరి చిత్రంలోని పరుగులు తీయాలీ పాట బిట్ ను ఉపయోగించుకుంటూ శేఖర్ కమ్ముల తన ఫిదా చిత్రంకోసం కంపోజ్ చేయించుకున్న ఒక అందమైన పాట ఈ రోజు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఫిదా (2017)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : వనమాలి
గానం : సింధూరి, సినవ్ రాజ్

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిర గిర గిల్లే నీలోనా
బిర బిర సుడులై తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్నా
దొరకను అందా నీకైనా

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి

కదిలే కదిలేయ్
చినుకే కదిలే
ముసిరే ఒక ముసురేయ్
ఇలకాల యీకాకే
వురికే వురికే
జతగా వురికేయ్
మనసే నిను మరిచి
తనకాలా యీకాకే
ఓ ఓ ఓ ఓ
సోయ లేదే హయిలోన
కమ్ముతుంటె గాలి వాన
ఏమౌతుందో ఏమో లోన
నీకు తెలిసేన
నీలోన హైరాన
నన్ను ముంచేన
నాలోని జడివాన

హే పిల్లగాడా
ఏందిరో పిల్లగాడా
నా గుండె కాడా లొల్లి
హే మొనగాడా
సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి
గిర గిర గిల్లే నీలోనా
బిర బిర సుడులై తిరిగేనా
నిలవద నువ్వేం చేస్తున్నా
దొరకను అందా నీకైనా

మంగళవారం, అక్టోబర్ 10, 2017

వచ్చిండే మెల్ల మెల్లగ...

ఇటీవలి సూపర్ హిట్, కలక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసిన ఫిదా చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఫిదా (2017)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం: మధుప్రియ, రాంకీ, కోరస్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

హే.. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే
డిన్నరన్నాడే డేటు అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే హెయ్ హెయ్
 
వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
 పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే..ఒచ్చిండే..ఏఏ..ఆఅ.
మగవాళ్లు మస్తు చాలు.. హొయ్ హొయ్ 
మగవాళ్ళు మస్తు చాలు..ఆహ 
మగవాళ్ళు మస్తు చాలు.. మస్కలు కొడతా ఉంటారే
నువ్వు వెన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే
ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ
మెయింటేను నువ్వు జేస్తే
లైఫ్ అంతా పడుంటాడే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

అయ్ బాబోయ్ ఎంత పొడుగో 
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందో నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
ఫరవాలే నడుము పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నాయిలే
పరేషానే నీకక్కర్లే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
 
హేయ్ పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే..ఏఏ..
డిన్నరన్నాడే డేటు అన్నాడే అన్నాడే..ఏఏ..
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే
అరే ఓ పిల్లా ఇంకా నువ్వు
నేలనిడిచి గాలి మోటర్‌లో.. తుర్ర్.ర్.ర్.ర్.ర్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండామస్తు డిస్ట్రబ్ జేసిండే


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.