మంగళవారం, అక్టోబర్ 02, 2018

దండాలు దండాలు...

అమ్మోరు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమ్మోరు (1995)
సంగీతం : చక్రవర్తి, శ్రీ
సాహిత్యం : మల్లెమాల
గానం : మనో, మాధవపెద్ది రమేష్

మాయమర్మమెరగనోళ్ళం
మట్టి పిసికి బతికెటోళ్ళం 
 
ఊరి దేవతైన నిన్నే
ఊపిరిగా కొలిసెటోళ్ళం
గండవరం నెయ్యి పోసి
గారెలొండి తెచ్చినాము
 
బుజ్జిముండ కల్లుకుండ
వెంటబెట్టుకొచ్చినాము

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో
పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో
ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

ఆదిశక్తిని నేనే అన్నపూర్ణను నేనే
జై సకల లోకాలేలు సర్వమంగళి నేనే
బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ
నిడదవోలు సత్తమ్మ నేనే

అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు
అన్నూళ్ళ దేవతను నేనే
మీ బాధలను తీర్చి మీకోర్కెలీడేర్చి
అలరించి పాలించు అమ్మోరు నేనే...

దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో

పాదులేని తీగకు పందిరేసిన తల్లివి
మోడుబారిన కొమ్మకు పూలు తొడిగిన అమ్మవి
ఆపదలు పోగొట్టి కాపురము నిలబెట్టి 
కరుణించి కాపాడినావు 
అరుదైన వరములను అనుకోని శుభములను 
నా బ్రతుకుపై చల్లినావు 
ఈలాగే నీ అండే ఎప్పటికీ నాకుంటే 
లోకంలో సుఖమంతా నా వశమౌతుంది 
దండాలు దండాలు అమ్మోరు తల్లో
శతకోటి దండాలు మాయమ్మ తల్లో
కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో
చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో

2 comments:

సునయనని ఈ పాటలో చూస్తున్నప్పుడు భక్తి తో పాటు తెలీని భయం కూడా కలుగుతుంది యెప్పుడూ..

హహహ అవునండీ.. అంతగొప్పగా నటించింది ఆ చిన్నారి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.