మొండిమొగుడు పెంకిపెళ్ళాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
సెలయేరై ఉరికే జోరులో
అలవై నన్ను లాలించుకో
చెలినీవై కలిసే వేళలో
కసిగా వచ్చి కవ్వించుకో
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
తానమాడు తంగేటి తేనెలలో
తాళమేసుకో తీపి ముద్దూ
తీగమీటి పోయేటి వెన్నెలలో
పాటకన్నా నీ పైట ముద్దు
కౌగిలింతలకుస్తీ తనకిస్తీ
కన్నెవలపుల కుస్తీ చవిచూస్తి
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కో..కోకో..కోన వెన్నెల కురిసిన పూపొదలా
కోకిలమ్మ కొత్తిల్లు కోరుకునీ
అత్త ఇంటికే చేరె నేడు
గున్నమావి కొమ్మల్ని వీడుకుని
గుండెగొంతులో పాట పాడు
చేతిలో చేయివేస్తీ మనసిస్తీ
రాజధానని వస్తీ ఎద బస్తీ
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
సెలయేరై ఉరికే జోరులో
అలవై నన్ను లాలించుకో
చెలినీవై కలిసే వేళలో
కసిగా వచ్చి కవ్వించుకో
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
సెలయేరై ఉరికే జోరులో
అలవై నన్ను లాలించుకో
చెలినీవై కలిసే వేళలో
కసిగా వచ్చి కవ్వించుకో
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
తానమాడు తంగేటి తేనెలలో
తాళమేసుకో తీపి ముద్దూ
తీగమీటి పోయేటి వెన్నెలలో
పాటకన్నా నీ పైట ముద్దు
కౌగిలింతలకుస్తీ తనకిస్తీ
కన్నెవలపుల కుస్తీ చవిచూస్తి
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కో..కోకో..కోన వెన్నెల కురిసిన పూపొదలా
కోకిలమ్మ కొత్తిల్లు కోరుకునీ
అత్త ఇంటికే చేరె నేడు
గున్నమావి కొమ్మల్ని వీడుకుని
గుండెగొంతులో పాట పాడు
చేతిలో చేయివేస్తీ మనసిస్తీ
రాజధానని వస్తీ ఎద బస్తీ
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
సెలయేరై ఉరికే జోరులో
అలవై నన్ను లాలించుకో
చెలినీవై కలిసే వేళలో
కసిగా వచ్చి కవ్వించుకో
కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా
కోన వెన్నెల కురిసిన పూపొదలా
4 comments:
"kaoma lambada" అన్న ఒక మ్యూజిక్ ఆల్బం నుంచి కాపీకొట్టిన ట్యూన్ ఇది. కీరవాణిగారు మొదట్లో ఇలాంటివి చాలా చేశారు. వేటూరిగారి పదవిన్యాసం ఇందులో కూడా కనిపిస్తుంది. వేణూ గారూ "రాజధానని వస్తీ ఎద బస్తీ" అన్నట్లుగా వినిపించింది. "నీ హృదయమనే బస్తీనే నాకు రాజధాని" అన్న అర్ధంలో
ఈ మూవీ లో లాలూ దర్వాజ సాంగే యెక్కువ విన్నామండీ..
అవును శాంతి గారు ఆ పాటే ఎక్కువగా ఫేమస్ అండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
థాంక్స్ భవానీ ప్రసాద్ గారు సరిచేశాను.. కీరవాణి గారు ఫారెన్ ట్యూన్స్ చాలా వాడారండీ నిజమే..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.