ఈరోజు 1st April అంటే ఏప్రిల్ ఫూల్స్ డే... అలా అనుమానంగా చూడకండి ఈ పోస్ట్ సాథారణమైనదే నో ప్రాంక్స్ ఇన్ ఇట్... మిమ్మల్ని ఫూల్ చేసే ప్రయత్నం చేయబోవట్లేదు. ఈ అకేషన్ కి సరిపడ పాట ఏముందా అని ఆలోచిస్తుంటే చిన్నప్పటినుండీ వింటున్న ఈ పాట గుర్తొచ్చింది. ఇందులో రమాప్రభ గారు రాజబాబుని ఫూల్ చేసినంతగా మరెవరూ చేసుండరేమో కదా అందుకే ఈ సందర్బంగా సరదాగా ఈ పాట చూసి విని నవ్వుకోండి. ఈ పాట ఇక్కడ చూడవచ్చు లేదా ఎంబెడ్ చేసిన వీడియో ని 14:56 వరకూ ఫార్వర్డ్ చేసి చూడండి. బెటర్ క్వాలిటీ ఆడియో ఇక్కడ వినవచ్చు. ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఇల్లు-ఇల్లాలు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : అప్పలాచార్య
గానం : జానకి, రాజబాబు
వినరా సూరమ్మ కూతురు మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
వినరా సూరమ్మ కూతురు మొగుడా...
విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
చెప్పు మలీ
కారు మబ్బులూ కమ్మిన వేళా...
కాకులు గూటికి చేరే వేళ...కా..కా...
చందమామ తొంగి చూసేవేళా ...
సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో...
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...
ఏం జలిగిందీ...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
తలుపు కిర్రునా చప్పుడైనది...
గుండె ఝల్లునా కొట్టుకున్నది...
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను...
వచ్చినదెవరో చూశాను...
ఎవలాలూ...
నల్లనివాడు...గుంట కన్నుల వాడు ..
గుబురుమీసాల వాడు ...
అయ్యబాబోయ్...
ఆరడుగుల పొడుగు వాడు ...
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు ...
ఏయ్ వాణ్ణీ నే నలికేత్తాను....
నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకొన్నా...
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ ...
అమ్మా...నాన్నా....
అమ్మా...నాన్నా...కాపాడమంటూ...అల్లాడిపోయాను..
అయినా గానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు...
అంతలో వచ్చింది... ఏవిటీ మూల్చా?
కాదు... మా అమ్మ... హి హి ఏవంది?
వెళ్ళవే నా తల్లి... వెళ్ళవే అమ్మా...
ముద్దులిస్తే... నీకు డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు... డబ్బులిస్తాడు...
మంచి బట్టలిస్తాడు....అనీ ముందుకు తోసింది
హా అది తల్లా!!.. కాదు లాచ్చసి..
పిశాచి...దెయ్యం....
తలవాతేవైందో చెప్పు ...
తప్పనిసరియై వెళ్ళేను .సిగ్గుపడుతు నిలుచున్నాను..హా..
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు...
తన దుప్పటిలో చోటిచ్చాడు...
ఛీ.. కులతా పాపాత్ములాలా...
నువ్వు నాకొద్దు.. ఫో.. వాడిదగ్గిరికే పో...
అంత కోపం ఎందుకయ్యా ...అప్పుడు నావయసైదయ్య ...
ఏవిటీ అప్పుడూ నీకైదేళ్ళా..ఆ...హహ..
అంత కోపం ఎందుకయ్యా... అప్పుడు నావయసైదయ్యా ...
ఆ వచ్చినదీ మా తాతయ్య...
తాతయ్య....తాతయ్యా...
తకతయ్య... మలి చెప్పవేం....
తాతయ్య....తకతయ్య..
తాతయ్య....తకతయ్య..
తాతయ్య....తకతయ్య.. హహహ..
తాతయ్యా...నేనూ ఎవలో అనుకున్నాను....
తాతయ్య కొంప ముంచేశాలు.. హహహహహ..
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
అసలు ఏప్రిల్ ఒకటవ తేదీనే ఫూల్స్ డే గా ఎందుకు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అని మీకెపుడైనా సందేహం వచ్చిందా.. వస్తే వివరాల కోసం ఈ వీడియో చూడండి. క్లుప్తంగా ఒక్క లైన్ లో చెప్పాలంటే పదిహేనో శతాబ్దానికి పూర్వం జూలియన్ క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ ఒకటిన కొత్తసంవత్సరం జరుపుకునేవారట. ఆ తర్వాత ప్రపంచం అంతా గ్రెగారియన్ క్యాలండర్ కి మారి జనవరి ఒకటిన కొత్త సంవత్సరం జరుపుకోవడం మొదలుపెట్టినా కొందరుమాత్రం సమాచారం లేకో ఛాందస వాదంతోనో ఏప్రిల్ ఒకటినే సెలెబ్రేట్ చేస్కోవడం చూసి వారిని ఫూల్స్ కింద జమకట్టేసి ఈరోజుని ఇలా ఆల్ ఫూల్స్ డేగా సెలెబ్రేట్ చేయడం మొదలైందట. మరిన్ని సరదా వివరాల కోసం వీడియో చూడండి.
4 comments:
Memu kudaa radio lo vachchinappudalla mottam vinevaallam.bhale saradaa paata:)
అవునా తృష్ణ గారు... నాకు ఇప్పటికీ భలే సరదాగా అనిపిస్తుందండీ :-) థాంక్స్ ఫర్ కామెంట్.
ఫస్ట్ యియర్ కాలేజ్ లో మా డెస్క్స్ పై బ్యూటిఫుల్ సెంటెడ్ కవర్స్ వున్నాయి..యెంటా అని మేం తెరిచి చూస్తే లోపల యేప్రిల్ ఫూల్ అన్న అక్షరాలు ప్రత్యక్షం..తరువాత ఆ ట్రిక్ మేం చాలా మంది మీద ప్రయోగించామను కోండి..అది వేరే విషయం..థాంక్స్ ఫర్ బ్రింగింగ్ బాక్ ద అల్లరి మెమొరి వేణూజీ....
థాంక్స్ శాంతి గారు, మీ అల్లరి జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.