సోమవారం, ఏప్రిల్ 28, 2014

ఈ చైత్ర వీణా...

వంశీ ఇళయరాజా వేటూరి ఈ ముగ్గురు కలిస్తే ఇక మనకు మాటలకు అవకాశమెక్కడ ఉంటుంది చెప్పండి తనివితీరా కమ్మని పాటను ఆస్వాదించడమే తప్పించి. ప్రేమించు పెళ్ళాడు సినిమాకోసం ఈ ముగ్గురు సిద్దం చేసిన ఈ అద్భుతమైన పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమే వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..
తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా... 
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన.. 
 

2 comments:

వంశీగారి ఊహలకి ప్రాణం పోసినట్టుండే, భానుప్రియని కుడా మీ కాంబినేషన్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి వేణూజీ..

అలాగే శాంతి గారు తప్పకుండా :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.