సుశీలమ్మ గానం చేసిన ఈ అన్నమయ్య కీర్తన నేను చాలా రోజులనుండి వింటూన్నాను కానీ ఇది ఏదో పాత సినిమాలోని పాట అనే భ్రమలోనే ఉన్నాను. ఈరోజు పబ్లిష్ చేద్దామని ప్రయత్నించినపుడు ఇది శ్రీ రామ గానామృతం అనే ప్రైవేట్ ఆల్బమ్ లోని పాట అని తెలిసింది. ఈ ఆల్బమ్ లో బాలు గారితో పాటు వీరు పాడిన మరికొన్ని మంచి పాటలు కూడా ఉన్నాయి. సంగీతం కె.వి.మహదేవన్ అని కొన్ని చోట్ల పుహళేంది అని ఉంది ఈ అల్బమ్ గురించి మరిన్ని వివరాలు తెలిసినవారు ఇక్కడ కామెంట్ రూపంలో పంచుకోగలరు. నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ కీర్తనపై చక్కని విశ్లేషణను ఇక్కడ చదవండి.
ఆల్బమ్ : శ్రీ రామ గానామృతం
సంగీతం : పుహళేంది
సాహిత్యం : అన్నమయ్య
గానం : పి.సుశీల
రామచంద్రుడితడూ రఘువీరుడూ
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు
గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలి యిహపర దైవము
రామచంద్రుడితడూ రఘువీరుడూ
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడూ రఘువీరుడూ
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము
నిరతి విభీషణుని పాలి నిధానము
గరిమ జనకు పాలి ఘన పారిజాతము
రామచంద్రుడితడు రఘువీరుడు
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవెంకటాద్రి విభుడీతడు
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికీ
రామచంద్రుడితడు రఘువీరుడు
రామచంద్రుడితడూ రఘువీరుడూ
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు
గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
గౌతము భార్యాపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలి యిహపర దైవము
రామచంద్రుడితడూ రఘువీరుడూ
కామిత ఫలములీయ గలిగేనిందరికి
రామచంద్రుడితడూ రఘువీరుడూ
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము
నిరతి విభీషణుని పాలి నిధానము
గరిమ జనకు పాలి ఘన పారిజాతము
రామచంద్రుడితడు రఘువీరుడు
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలీ ఆదిమూలము
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవెంకటాద్రి విభుడీతడు
రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగేనిందరికీ
రామచంద్రుడితడు రఘువీరుడు
12 comments:
నాకెంతొ ఇష్టమైన పాట ఇది.మీకు సమయము దొరికినప్పుడు దయ చెసి ఈ పాటకు అర్థాన్ని వివరింపగలరు.కొన్ని పదాలు అర్థం కావడము లెదు మరొల భావించకండి. Thanks in advance.
థాంక్స్ అజ్ఞాత గారు... ఈ కీర్తనకు చక్కని విశ్లేషణ ఈ బ్లాగ్ లో ఉంది చూడండి
ఇత్యేషా మనీషా మమ
అలాగే ప్రతి పదార్ధం కావాలంటే ఇక్కడ చూడవచ్చు.
తెవికీ
తెవికీలో లేని కొన్ని పదాలకు నిఘంటువులో లభించిన అర్ధాలు.
ఘాతలాడు = నిందించు
పరగ = Agreeably, duly. ఒప్పుగా.
నిరతి = మిక్కిలి ఆసక్తి. excessive fondness, attachment or devotion.
నిధానము = నిధి
గరిమ = గొప్పతనము.
ఈ పాటలన్నీ చిన్నప్పుడు ప్రతి గుడిలోనూ మైకుల్లో వేయడం ద్వారానూ, రేడియో లో అర్చన కార్యక్రమం ద్వారానూ మనకి పరిచయం అయినవే!!
ఈ ఆల్బం లో పాటలన్నీ రాసింది సినారె!ఇది అన్నమయ్య కీర్తన అని నాకు తెలీదు! నిజంగానేనా? ఈ పాటలో సాహిత్యం ఎక్కువ బాగుంది, మరో పాటలో అంతగా బాలేదు అని చెప్పలేం!ఒక్కోటీ ఒక్కో ఆణిముత్యం!
మేలుకో శ్రీరామా పాటలో..తరుణి సీతమ్మ తల్లి గృహ విధుల మునిగింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్యా అని ఒక లైన్లో ఉంటుంది. ఆ లైన్ నాకు చాలా ఇష్టం~!
అలాగే బలే వాడివి శ్రీరామా శ్రీరామా నీ బడాయి చాలును రఘురామా అనే పాటలో, తాటకని చంపడం, ఇంకెవరినో వధించడం గొప్ప కాదు, చేతనైతే నా అహంకారాన్ని చంపు చూద్దాం అని సవాళ్లు విసిరే ఒక భక్తుడి అంతరంగం.. ఇలా ప్రతి పాటా ఓక ప్రత్యేకత తో ఉంటుంది.
నా దగ్గర కాసెట్ ఉండేది. దాని మీద పుహళేంది అనే ఉంది. పుహళేంది మహదేవన్ అసిస్టంట్ కాబట్టి మరి ఇద్దరూ కల్సి కూర్చారేమో చెప్పలేం!
ఆల్బమ్ గురించిన వివరాలు అందించినందుకు థాంక్స్ ఎ లాట్ సుజాత గారు. అవునండీ చిన్నపుడు రేడియోలోనూ గుళ్ళలోనూ విన్నపాటలే ఇవి.
ఇది అన్నమయ్య కీర్తనే అని ఉందండీ అన్ని చోట్లానూ. ఇతర గాయనీ గాయకులు పాడిన వర్షన్స్ కూడా ఉన్నాయి.
మేలుకో శ్రీ రామా, భలేవాడివి శ్రీరామా మంచి మంచి పాటలు గుర్తుచేశారు.
క్యాసెట్ మీద ఉందంటే పుహళేంది గారే అయి ఉంటారండీ, పోస్ట్ లో అప్డేట్ చేశాను. థాంక్స్ ఎ లాట్ ఒన్స్ ఎగైన్.
అయితే ఇది అన్నమయ్య కీర్తనే అయి ఉంటుంది లెండి! ఇంకా ఇందులో "రాముడూ లోకాభిరాముడు"
"జయ జయ రామా సమర విజయ రామా"
ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా నిను ఏమని కీర్తించాలయ్యా
పాటలు (ఆల్బం లో ఇంకా పాటలున్నాయనుకోండి) బాగుంటాయి. అన్నిటికంటే అప్పట్లో బాలు గొంతు మంచి ఫాం లో ఉంది. అందుకేనేమో సంగీతం+సాహిత్యం+గానం అన్నీ సమపాళ్లలో పడి ఆల్బం అంతా చక్కగా తయారైంది
సుజాతగారు! పాటల సాహిత్యంలో ఆరుద్ర మార్కు కనపడుతోంది ? అన్నింటిలోనూ k.v.మహదేవన్, పుహళేందిల stamp స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పటికీ నిలిచిఉండే పాటలివి.
వేణు శ్రీకాంత్ గారు: thank you.
థాంక్స్ సుజాత గారు.. రాముడూ లోకాభిరాముడు కూడా నాకు చాలా ఇష్టమైన పాటండీ.
థాంక్స్ తెలుగు అభిమాని గారు.
వేంకటేశ్వర మకుటం కూడా వుంది కాబట్టి అన్నమయ్య కీర్తనే వేణూజీ..ఇది చూస్తే శ్రుతిలయల్లో "తెలవారదేమో స్వామి" పాట (రచన..సిరివెన్నెలగారు), అన్నమాచార్య కీర్తన అని చాలామంది పొరపడిన విషయం గుర్తుకు వచ్చింది ..
కరెక్ట్ శాంతి గారు నేను కూడా చాలారోజులు "తెలవారదేమో స్వామి" పాటని కీర్తనే అని అనుకునే వాడిని, హాట్సాఫ్ టు సిరివెన్నెల గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.
అబ్బ...
మంచి విషయాలు మళ్ళీ గుర్తుచేసినందుకు మీఅందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
గుడి మైకులో విన్న ఆపాటలు... ఆహా... అధ్బుతః...
చిన్నప్పుడు శ్రీరామ గానామృతం అనే పాటల కాసెట్ కొనుక్కుని విన్నాను.
మీరందరూ చెప్పినట్టు అందులోని పాటలు.. ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం.
-వెంకటపతిరాజు-
ధన్యవాదాలు వెంకటపతిరాజు గారూ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.