బహుముఖ ప్రజ్ఞాశీలి భానుమతి గారినీ, కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన జానకమ్మగారిని మినహాయిస్తే, తెలుగులో సంగీత దర్శకత్వాన్నే కెరీర్ గా ఎంచుకున్న తొలి మహిళగా ప్రత్యేకతను సంతరించుకున్న ఎం.ఎం.శ్రీలేఖ గారి మొదటి సినిమా తాజ్ మహల్ లో నాకు నచ్చిన పాట ఇది అప్పట్లో చాలా వినేవాడ్ని. చాలా సింపుల్ ఆర్కెస్ట్రేషన్ ఆహ్లాదకరమైన బాణి ఈ పాట సొంతం మీరూ ఆస్వాదించండి. ఈ పాటలు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : తాజ్ మహల్ (1995)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు, చిత్ర
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా
అందమంత అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం
కొత్తదాహంలో వింతమోహంలో
మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా
వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం
ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని
ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంటా ఏకం కమ్మంటా
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు, చిత్ర
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా
అందమంత అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం
కొత్తదాహంలో వింతమోహంలో
మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా
వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో
వలపుకే వందనం
ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి
ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని
ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా
లోకం నువ్వంటా ఏకం కమ్మంటా
వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా
యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని
తరగని ప్రేమలలో
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే
నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలుదాటిన
అల్లరి ప్రేమలలో
యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని
తరగని ప్రేమలలో
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ నిన్న
కన్నె వన్నెలన్నిచూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావికొమ్మ సన్నజాజి రెమ్మ ముచ్చటాడే
నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం
పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా
శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలుదాటిన
అల్లరి ప్రేమలలో
మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
చందనాలు చల్లిపో
పల్లవించుతున్న ప్రణయమా
మళ్లీ మళ్లీ వచ్చిపో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో
మధురమీ సంగమం
మధురమీ సంగమం
2 comments:
విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీలేఖ ఫాన్స్..ఆవిడని భానుమతి, జానకమ్మ గార్ల తరువాత మెన్షన్ చేయడం..మీరు అందించిన వివరాలు కరెక్టే ఐనా..డైజెస్ట్ కాలేదు వేణూజీ..కాపోతె యేకైక బెటర్ సాంగ్ వేయటం వల్ల ఊపిరి పీల్చుకో గలిగాము..
ఓహ్.. సారీ శాంతి గారు, నా స్టేట్మెంట్ అలాంటి అర్ధాన్నిస్తుందనుకోలేదు.. వారిద్దరితో శ్రీలేఖ గారిని కంపేర్ చేసే ఉద్దేశ్యం నాకు అస్సలు లేదండీ. మహిళా సంగీత దర్శాకుల గురించి తలచుకోగానే వారిద్దరు గుర్తురావడంతో అలా మెన్షన్ చేయవలసి వచ్చింది అంతే.
థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.