బుధవారం, ఏప్రిల్ 30, 2014

కన్నె కొమ్మన తుమ్మెద...

ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో వచ్చిన కాలాపాని సినిమాలో దదాపు అన్నిపాటలు బాగున్నా కూడా ఈ పాట నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ప్రత్యేకంగా చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట ఆసక్తికరంగా చిత్రీకరించారు ప్రియదర్శన్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : కాలా పాని (1996)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : నారాయణ వర్మ
గానం : బాలు, చిత్ర

కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల ..ఉయ్యాలల.. ఆనవాలా...
విందీయగ.. పూదేనియ.. ఓయిలాలా..


కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ..
ఈడేరగ.. తారడగ.. అబ్బురాలా..
నాజూకుగ.. నాదానిగ.. అమ్మలాల..

గుండెల్లోన తొలకరింపు పొంగే జల్లుల్లో..
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో..

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల.. ఆనవాలా
విందీయగ.. పూదేనియ.. ఓయిలాలా


మిలమిల కళ్ళల్లో అల పూచే పున్నాగ తేరు.. హొయ్
చెలి చిరు హృదయంలో ఎల సవ్వడి ముచ్చట తీరూ...ఊఊ..
కోరికల కోన ..సంబరమాయే చేరుకోవే మైనా...ఆ..
గొరింక వలచి వచ్చి మారాలా...
ఊసుల్ని ఉసిగొల్పి జాగేలా...

బాలా.. పరువాల సిగ్గు మురిపాల.. ముద్దాడగనేల..
ఎద ఈడేరిన వేళ..

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల..ఆనవాలా
విందీయగ.. పూదేనియ..ఓయిలాలా

 
గల గల గోదారి.. సడి సరాగాల హోరూ..ఉయ్..  

అరమరికలు లేక ఎద విహారాల జోరు... హొయ్
పూచినది ప్రాయం తుమ్మెద వాల... మనసు కోరి సాయం... 

 పూదోట మాటు చూసి పోదామా..
సరసాల జాగారం చేద్దామా...
ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం...
ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం...


కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగ..
ఈరేడగ.. తారడగ.. అబ్బురాలా..
నాజూకుగ.. నాదానిగ.. అమ్మలాల..

గుండెలోన తొలకరింపు పొంగే జల్లుల్లో 

 కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో

కన్నె కొమ్మన తుమ్మెద.. రావమ్మా జత కట్టమ్మా..
సయ్యాటల.. ఉయ్యాలల ..ఆనవాలా
విందీయగ.. పూదేనియ ..ఓయిలాలా 

 

2 comments:

ఇందులో తబు మేకప్ చాలా డిఫరెంట్ గా వుంటుంది..తను చాలా అందం గా వుంటుంది..

కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.