శనివారం, ఏప్రిల్ 26, 2014

ఓ నేనే ఓ నువ్వని...

కలవరమాయే మదిలో సినిమాలో నాకు నచ్చిన ఒక మాంచి రొమాంటిక్ మెలొడీ... మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.

చిత్రం : కలవరమాయే మదిలో (2009)
సంగీతం : శరత్ వసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : హరిహరన్, కల్పన

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని.. నీ వెంటే వున్నానని.. చాటనీ
చేశానే నీ స్నేహాన్ని.. పోల్చానే నా లోకాన్ని.. నీ వాణ్ణి ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ

మారాము చేసే మా రాణి ఊసే నాలోన దాచానులే...
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకేనే..
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడాను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ

ఆఆఆఆఆఅ...ఆఆఆఆ....
నీ నీడలాగ నీతోనే వున్నా.. నీ జంట నేనవ్వనా...
వేరేవ్వరున్న నీ గుండెలోన.. నా కంట నీరాగునా...

ఆ తలపు నా ఊహ కే తోచునా ...నా శ్వాస నిను వీడి జీవించున...
నీ కంటి పాపల్లె నే లేనా ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ
నేనంటూ ఇక లేనని.. నీ వెంటే వున్నానని.. చాటనీ
చేశానే నీ స్నేహాన్ని.. పోల్చానే నా లోకాన్ని.. నీ వాణ్ణి ..

ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీ 

4 comments:

నాకు చాలా ఇష్టం..:)

హరిహరన్ గారి గొంతులో యెటువంటి పాటైనా ఇట్టే అందంగా వొదిగి పోతుంది..వీలైంతే ఆయన గజల్స్ ని అందించగలరా..

థాంక్స్ శాంతి గారు, అలాగే తప్పకుండా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.