బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమా కోసం ఆరుద్ర గారు రాయగా బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఈ పాట నాకు ఇష్టమైన రాముడి పాటలలో ముందు ఉంటుంది. మహదేవన్ గారి సంగీతం బాలమురళి గారి గాత్రం మనసును ఆనంద డోలికలూగిస్తాయి. కింద ఎంబెడ్ చేయబడినది పాట ప్లస్ ఫోటోలతో కూడిన ప్రజంటేషన్. సినిమాలో టైటిల్స్ కి నేపధ్యంగా వచ్చే ఈ పాట చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలమురళీకృష్ణ
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘు కులాన్మయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
శ్రీరామ జయ రామ సీతారామా
శ్రీరామ జయ రామ సీతారామా
కారుణ్యధామా కమనీయనామా
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామా
నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామా
చరణాలు కొలిచే నగుమోము చూచే
చరణాలు కొలిచే నగుమోము చూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామా
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామా
నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్యగరిమ
శ్రీరామ జయ రామ సీతారామా
కారుణ్యధామా కమనీయనామా
2 comments:
ఈ పాట లో "కారుణ్య ధామా" అన్న పదం బాలమురళీ కృష్ణగారు యెంత సున్నితంగా పలికారంటే, కళ్ళు మూసుకుని వింటే..లోకంలోని కారుణ్యాన్నంతా తన కలువకళ్ళ లో నింపుకుని ఆ రామచంద్ర మూర్తి మన కేసే చూస్తున్నట్టుంటుంది..
చాలా కరెక్ట్ గా చెప్పారండీ శాంతి గారు. థాంక్స్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.