ఈ జీవనరాగం ప్రోగ్రామ్ దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యేదట. నాకు చూసిన గుర్తు లేదు కానీ ఈ వీడియో యూట్యూబ్ లో చూసి చాలా బావుందనుకున్నాను. తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాటోగ్రాఫర్ మీర్ గారి సారధ్యంలో తెరకెక్కిన ఈ ప్రోగ్రామ్ లోని పాటలు బావున్నాయి. మన జీవితంలోని వివిద సంధర్బాలకు తగినట్లుగా పాటలను కూర్చి చేసిన ప్రోగ్రామ్ ఇది.
ఈ పాట తన కొడుకుకి మేనకోడలినిచ్చి పెళ్ళి చేయమని ఓ చెల్లి తన అన్నగారిని అడుగుతున్న సంధర్బంలోనిది. సుమ, రాజీవ్ కనకాల ఆ పెళ్ళి జంట కాగా నరసింహ రాజు గారు, సన అన్నా చెల్లెళ్ళు. అప్పటి దూరదర్శన్ యాంకర్ అండ్ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్ప గారి వ్యాఖ్యానం అదనపు ఆకర్షణ. ఈ పాట విశేషమేంటో మీరూ చూడండి. ఎంబెడ్ చేసిన వీడియో
ఇక్కడ చూడవచ్చు. ని.10:18సె. వద్దనుండి ఈ పాట మొదలవుతుంది. ఇదే వీడియోలో 18 నిముషాల నుండి సుమ రాజీవ్ ల మీద తీసిన "చెట్టులెక్క గలవా" పాట కూడా ఉంది చూడండి.
సీరియల్/ప్రోగ్రాం : జీవనరాగం (1995)
సంగీతం :
సాహిత్యం : ఆర్.ఛాయాదేవి
గానం :
ఆరు నూరామడల నుంచి అన్నయ్యా
పెళ్ళి బేరాలకొచ్చినాను అన్నయ్యా
ఆరు నూరామడల నుంచి అన్నయ్యా
పెళ్ళి బేరాలకొచ్చినాను అన్నయ్యా
పిల్లనడగ వస్తినో అన్నయ్యా
పిల్లనడగ వస్తినో అన్నయ్యా
నేను కన్నెనడగ వస్తినో అన్నయ్య
నేను కన్నెనడగ వస్తినో అన్నయ్య
కన్యనిచ్చేమాట కలలోనె లేదు
కన్య నివ్వనమ్మా చెల్లెలా.. ఆ..
కన్యనిచ్చేమాట కలలోనె లేదు
కన్య నివ్వనమ్మా చెల్లెలా..
నా పిల్లనివ్వనమ్మా చెల్లెలా
పెళ్ళి పిల్లనివ్వనమ్మా చెల్లెలా
నేను పిల్లనివ్వనమ్మా చెల్లెలా
నా పిల్లనివ్వనమ్మా చెల్లెలా
సరిగంచు చీరలున్నాయ్ చెల్లెలా
కుంకూమ భరిణెలున్నాయ్ చెల్లెలా
సరిగంచు చీరలున్నాయ్ చెల్లెలా
కుంకూమ భరిణెలున్నాయ్ చెల్లెలా
కట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
నువ్వు పెట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
కట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
నువ్వు పెట్టుకు వెళ్ళమ్మా చెల్లెలా
ఆ మాటకేమిగాని అన్నయ్యా
ఆ తీరుకేమిగాని అన్నయ్యా
ఆ మాటకేమిగాని అన్నయ్యా
ఆ తీరుకేమిగాని అన్నయ్యా
కన్యనడగ వస్తినో అన్నయ్య
నేను పిల్లనడగ వస్తినో అన్నయ్యా
కన్యనడగ వస్తినో అన్నయ్య
నేను పిల్లనడగ వస్తినో అన్నయ్యా
మీ ఇళ్ళ మగవారు చెల్లెలా
ముచ్చూల వారైతీరి చెల్లెలా.. ఓహో..
కన్య నేలాగిస్తునూ చెల్లెలా
నేను పిల్లనేలాగిస్తునూ చెల్లెలా
కన్య నేలాగిస్తునూ చెల్లెలా
నేను పిల్లనేలాగిస్తునూ చెల్లెలా
మా ఇళ్ళ మగవారు అన్నయ్యా
ముచ్చుల వారైతే అన్నయ్యా
మా ఇళ్ళ మగవారు అన్నయ్యా
ముచ్చుల వారైతే అన్నయ్యా
నన్నేలాగిస్తివిరా అన్నయ్యా
నన్ను ఎలాగ ఇస్తివిరా అన్నయ్యా
నన్నేలాగిస్తివిరా అన్నయ్యా
నన్ను ఎలాగ ఇస్తివిరా అన్నయ్యా