సీతాకోకచిలక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సీతాకోకచిలక (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, వాణీజయరాం
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కన్యాకుమారి నీ పదములు నేనే
..ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళా
సుమ సుకుమారీ నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా
అలిగిన నా పలు అలకలు
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా
సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని.. వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళా
సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే
సాగర సంగమమే...
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, వాణీజయరాం
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కన్యాకుమారి నీ పదములు నేనే
..ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళా
సుమ సుకుమారీ నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా
అలిగిన నా పలు అలకలు
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా
సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని.. వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళా
సాగర సంగమమే..
ప్రణయ.. సాగర సంగమమే
సాగర సంగమమే...
3 comments:
Female SInger Susheela garu kada.
ఈ పాట పాడినది సుశీలమ్మ గారు.
ఈ చిత్రం లోని మాటే మంత్రము పాట సంగీత పరంగా కలకాలం నిలిచిపోయే ఒక అద్భుత గీతం.
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శశి గారు, జి.కెకె. గారు.
నిన్న ఇదే విషయమై కాస్త వెతికానండీ.. ఈ పాట ఫిమేల్ సోలో వర్షన్ సుశీల గారు, డ్యుయెట్ వర్షన్ వాణీజయరాం గారు పాడినట్లుగా ఉంది క్యాసెట్ కవర్ మీద అండ్ కొన్ని రిలయబుల్ సైట్స్ లో అందుకే వాణీజయరాం గారి పేరే ఉంచేశాను. క్యాసెట్ కవర్ ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు.
https://cassettecovers.files.wordpress.com/2014/02/1981-seetakoka-chilaka.jpg
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.