తెలంగాణ శ్లాంగ్ లో మంచి హిట్ సాంగ్స్ తో పాపులర్ అవుతున్న చౌరస్తా బ్యాండ్ కి చెందిన రామ్ మిరియాల రాసి కంపోజ్ చేసిన కరోనా సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ అంశం మీద మొదట పాపులర్ అయిన పాట ఇదే అనుకుంటాను. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
కరోనాకి కూడా కంగారు పుట్టించేలా రాసి పాడిన రామ్ గోపాల్ వర్మ గారి పాట ఇక్కడ చూడవచ్చు.
అలాగే ఇదే అంశం మీద వందేమాతరం శ్రీనివాస్ గారు కంపోజ్ చేసి పాడిన పాట ఇక్కడ చూడవచ్చు.
చౌరస్తా కరోనా సాంగ్ - 2020
సంగీతం : రామ్ మిరియాల
సాహిత్యం : రామ్ మిరియాల
గానం : రామ్ మిరియాల
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా
కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా
ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా
మంచి రోజులొచ్చేదాకా నిమ్మళంగా ఉండరా
సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు
బ్రతికుంటె చూసుకుందాం ఇప్పుడైతే బందుపెట్టు
ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నయిరా
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా
యుధ్ధానికి సిద్ధమా? రోగం తరిమేద్దమా?
ఆయుధాలు లేవురా హృదయముంటే చాలదా
కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా
కాలం మారే దాకా ఓపిక్కొంత పట్టరా
నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం
పగలనక రాత్రనక సైనికులై సాగినారు
ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే
బాధ్యత లేకుండా మనం వారికి బరువవుదామా?
లోకమంటే వేరు కాదు నువ్వే ఆ ఆలోకం రా
నీ బతుకు సల్లగుంటే లోకానికి సలవరా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.