బుధవారం, ఏప్రిల్ 15, 2020

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా...

టీవీ సీరియల్స్ చూడకపోయినా ఒకే సమయానికి ప్రతి ఇంట్లో మోగే టీవీల్లోంచి వచ్చే ఆ సీరియల్స్ టైటిల్స్ సాంగ్ నుండి మాత్రం తప్పించుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇక కాస్తో కూస్తో పాటల పిచ్చి ఉన్నవాళ్ళకి అసలు అసాధ్యం. అప్పట్లో అన్ని సీరియల్ పాటలు కాకపోయినా కొన్ని కొన్ని పాటలు భలే ఆకట్టుకునేవి మనకి తెలియకుండానే పాడేసుకునేంతగా నాటుకు పోయేవి వాటిలో అమృతం, ఋతురాగాలు, తర్వాత ఈ 'పిన్ని' అనే సీరియల్ సాంగ్. ఈ పాట ఐన తర్వాత పిన్నీ అని పిలిచే పిలుపు భలే చిత్రంగా అనిపించేది. ఎప్పటినుండో తెలియదు కానీ ఈ సీరియల్ రెండో సీజన్ మొదలవుతుందని విన్నాను.

ఈ పాటకి సంగీతం అందించినది ఎక్కువగా తమిళ్ టీవీ సీరియల్స్ కి సంగీతం అందించే 'దిన' అయితే రాసినది ఓంకార్ పరిటాల వీరు సీనియర్ నటుడూ మరియూ రచయిత, మన రియాల్టీ షోస్ వన్ సెకన్ ఓంకార్ కాదు. కొన్ని సినిమాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ సంభాషణా శైలితో ఆకట్టుకున్నారు, అలాగే తన రచనలలో సామాజిక అంశాలను చొప్పించి పేరు తెచ్చుకున్నారు. ఈ పాట ఫస్ట్ సీజన్ వీడియో మంచి క్వాలిటీ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఇదే పాట సెకండ్ సీజన్ విజువల్స్ తో  ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : పిన్ని
సంగీతం : దిన
సాహిత్యం : పి. ఓంకార్ (సీనియర్ యాక్టర్/రైటర్)
గానం : నిత్యశ్రీ 

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 

నిని సాసాస.. నిని సాసాస
నిసగగ నిసగగ గమపమగరిసా
నిసగగ నిసగగ గమపమగరిసా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం
గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం కాదా
సీత గీత దాటిందా యుద్దకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...ఓఓఓ...
ఝుంతనఝనఝన..ఝుంతనఝనఝన..
ఝుంతన..ఝుంతన..ఝుంతనన..ఓఓఓ...

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 


2 comments:

హ హ నిజమే వేణు శ్రీకాంత్ గారు. సీరియల్స్ ఎప్పుడూ చూడలేదు కానీ పిన్నీ అనే చిన్న పిల్ల పిలుపు మాత్రం చెవిన పడేది.

ఈ పాట నిత్యశ్రీ మహదేవన్ గారు కర్ణాటక సంగీత గాయని. జీన్స్ సినిమాలో కూడా కన్నులతో చూసేవి పాట పాడారు. అమ్మా అని ఎండ్ అయ్యేచోట గమ్మత్తుగా పాడారు.

థ్యాంక్స్ జికెకె గారూ.. అవునండీ నిత్యశ్రీ కన్నులతో చూసేదీ పాటతో బాగా ఫేమస్ అయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.