జి.వి.ప్రకాష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జి.వి.ప్రకాష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, ఏప్రిల్ 07, 2021

ఇలా ఇలా తేలాను...

జయలలిత గారి బయోపిక్ ’తలైవి’ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తలైవి (2021)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్  
సాహిత్యం : సిరాశ్రీ
గానం : సైంధవి  

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో
నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో

మేఘాలన్నీ చన్నీరంతా
నా మీద పన్నీరు జల్లేట్టుంది
పల్లకిలో ముస్తాబయ్యి 
జాబిల్లి ఊరేగినట్టే ఉంది
కన్నుల్లో ఉన్న కనుపాప కూడా
కలలేవో కంటూ ఉంది
నేలమ్మమనసే ఆ నింగికిచ్చి
ఓ ముద్దు కోరుతుంది

నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల
 

గురువారం, ఫిబ్రవరి 11, 2021

కన్నుల్లో ఉన్నావు...

పోలీస్ చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పోలీస్ (2016)
సంగీతం : జి.వి.ప్రకాష్       
సాహిత్యం : అనంత్ శ్రీరాం 
గానం : హరిహరన్, సైంధవి, వైకోం విజయలక్ష్మి 

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినదే.. ఓఓ
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత 
మంజులతర శృంగారే సంచారే
అధర రుచిత మధురితభగ సుధనకనక 
ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే
మమతమసకు సమదససత 
ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే

హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
కాలం ముగిసినా ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినదే... ఓఓఓ..
 



గురువారం, డిసెంబర్ 10, 2020

కాటుక కనులే...

ఆకాశం నీ హద్దురా సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆకాశం నీ హద్దురా (2020) 
సంగీతం : జి.వి.ప్రాకాష్ కుమార్  
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : ధీ

లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

కాటుక కనులే మెరిసిపోయే 
పిలడా నిను చూసీ
మాటలు అన్ని మరిసిపోయా 
నీళ్ళే నమిలేసీ…

ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు
గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు
ఈడుకేమో జాతరొచ్చేరా…

నా కొంగు చివర దాచుకున్న 
చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని 
అల్లరే నీదిరా..!
మొడుబారి పోయి ఉన్న 
అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చిగురులొచ్చేరా

నా మనసే నీ వెనకే తిరిగినదీ
నీ మనసే నాకిమ్మని అడిగినదీ

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

గోపురాన వాలి ఉన్న పావురాయిలా
ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా

నా మనసు విప్పి చెప్పనా… 
సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా
నే ఉగ్గబట్టి ఉంచినా… 
అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా

నీ సూదిలాంటి చూపుతో 
దారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా 
కలిపి కుట్టరా
నా నుదిటి మీద వెచ్చగా 
ముద్దు బొట్టు పెట్టారా

కుట్టి కుట్టి పోరా ఆ ఆ 
కందిరీగ లాగా…
చుట్టు చుట్టుకోరా ఆ ఆ 
కొండచిలువ లాగా…

కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా

నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా…
నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య
నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లగా
చీరకున్న మడతలే చక్కబెట్టారా

నీ పిచ్చి పట్టుకుందిరా
వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా
ఆ ఆ, నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా ఆ ఆ, 
వెన్నుపూసలాగా..

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ 


  

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2017

కుచ్చి కుచ్చి కూనమ్మా

టెడ్డీ డే సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బొంబాయి (1995)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, జి.వి.ప్రకాష్, శ్వేత, స్వర్ణలత

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం ఏ.
అమ్మనాన్న పిలుపు సుఖం

రాకుమారుడికి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలు
ముద్దు కన్నా ముడుపు సుఖం

రేయిపగలు పన్నీట్లో ఉన్నా
రాదు మేనికి చలికాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం
బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
ఆ.ఆ... బుజ్జి బుజ్జి పాపనివ్వు
పోకిరాట వేషమొద్దు
వేడెక్కే అందాల పెట్టు
వేదిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

చిరుత రెక్కలే పక్షివిలే
చిటెకె వెలుగులే దివ్వెవిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పున్నమిలే
తనువుతోటివే తపనలులే
ఉరుముతోటివే మెరుపులులే
ఉన్నతోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే
భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగ
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా.
కుందనాల కూనమ్మా.

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేసమింక చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా.


బుధవారం, మార్చి 23, 2016

ఒడె ఒడె ఒడె ఒడె...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు. ప్రేమలో పడితే లోకమంతా రంగులమయమైపోతుంది ఇక అదే ప్రేమను ప్రేయసి ఆమోదం లభిస్తే ఆ ప్రేమజంట రంగుల కలల్లో మునిగి తేలడాన్ని ఎవరాపగలరు. అలాంటి ఓ ప్రేమజంట కథను మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రాజా రాణీ (2014)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : విజయ్ ప్రకాష్, రానినా రెడ్డి

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే
చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా
దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే
లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా
మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే
మిస్సుడ్ కాల్ గా మార్చమాకే

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

భయం లేనోడినైనా చెయ్యాల్సొచ్చే ఫాలోయింగ్
కాళ్ళా వేళ్ళా పడితే మనసే కరిగి లవ్ గ్రోయింగ్
ప
క్కా పక్కనె ఉండి పదివేల లుక్సు బారోయింగ్
పక్కా శోధనవల్లే అప్పుడు ఇప్పుడు ఔట్ గోయింగ్
 
ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె
ఐకాన్ వా సైతాన్ వా నువ్వేమో స్వీటా లేదా హాటా..
 
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

నామది నీదని రాశావా రాసేశా

నీవే జ్ఞాపకమొస్తే న్యూరాన్స్ అన్ని మెరిసాయి
నీవే కల్లోకొస్తే హార్మోన్స్ అన్నీ మురిసాయి 
సాంగై వినిపిస్తాయి సంగతులన్నీ నీవల్లే
వ్రాంగ్ గా స్నేహం చేస్తే లంగ్స్ లో లవ్వే శ్వాసయ్యే
ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె
తిట్టైనా తిక్కైనా తియ్యంగా తీసుకుంటుంది జన్మ

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే
చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా
దిక్కులన్నీ అదిరే చుక్కలన్నీ చెదిరే
లేనే లేదు కుదురే లవ్ అంటే కష్టమా
మిస్టర్ ప్రేమ అంటూ నన్నే ఊరిలోన అంటారే
మిస్సుడ్ కాల్ గా మార్చమాకే

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..



గురువారం, మార్చి 19, 2015

చల్లగా ఒక చినుకులా...

రాజా రాణి సినిమాలోని ఈ పాట చాలా బాగుంటుంది. నాకు నచ్చిన పాటను మీరూ చూసీ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


 
చిత్రం : రాజా రాణి (2014)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
రచన : అనంత శ్రీరామ్ 
గానం : రాహుల్ నంబియార్, క్లింటన్, మేఘ

చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగేనే హల్లా
నీ కనుపాపై నే చేరినా పిల్లా
నీ కలలాగ నే మారినా పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ

ఓసి మడత కాజ నా మామిడి తండ్రా నవ్వి సంపొద్దే 
నా మోట బావిలో నీ నాటు వోడని అట్టా నడపొద్దే 
కళ్ళేవి పడకుండా కళ్యాణం చేద్దామా
కల కాలం ఉందామా…

కొంచెం చూడు మరి కొంచెం నవ్వు మరి
అంటూ నా కనులు హయ్యయ్యో నను తిట్టే
మండు వేసవిలో పండు వెన్నెలలు
చల్లుతుంది మది ఏదేదో పిచ్చి పట్టి
గాలివాన వలనే తోసినావు నాదు ఎదనే
నీ వల్లే అయ్యానే దారాన్నే
తెంపేసిన గాలి పటం
అమ్మాయి అమ్మాయి
నే పడితే చేరాలి నీ పాదం

నీ కనుపాపై హో..నే చేరినా పిల్లా
నీ కలలాగ హా..నే మారినా పిల్లా

చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగెనే హల్లా

సుందరి కిన్నరి మణి కొలుసా 
తరి వళకిరు కిలుక్కిరుక్కా
తరి మిన్నారం చెరు పొన్నారం
ఇదు మధుర మధుర కరింబో..కళ వేణీ మృదు పాణీ 
నిన్ హృదయ వనియలన్ గానం
స్వరమాయే జతిఆయే 
ఇన్ నుణరి మరియ నాన్ మొహం

ప్రేమ తాకి జ్వరమేదో సోకి మరి ఆవిరైతి 
నువు ముద్దిచ్చి తగ్గించు
కోపగించు కొను వేళలోన కనుపాప దొరకుండు
కోపాన్నే రప్పించు 
ఉసురు తీయు సొగసా నీ నీడకింత చలవా 
బతుకంతా బ్రతిమాల్నా విడిపోని మత్తేదో చల్లావే 
నదులైనా కడలైనా ఆపలేనీ నిప్పల్లె చేరావే

నీ కనుపాపై హో నే చేరినా పిల్లా
నీ కలలాగా హా నే మారినా పిల్లో
హే హే ఓ ఓ ఓ ఓ


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.