గురువారం, ఫిబ్రవరి 11, 2021

కన్నుల్లో ఉన్నావు...

పోలీస్ చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పోలీస్ (2016)
సంగీతం : జి.వి.ప్రకాష్       
సాహిత్యం : అనంత్ శ్రీరాం 
గానం : హరిహరన్, సైంధవి, వైకోం విజయలక్ష్మి 

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినదే.. ఓఓ
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

ఉభయ కుశల చిరజీవన ప్రసుత భరిత 
మంజులతర శృంగారే సంచారే
అధర రుచిత మధురితభగ సుధనకనక 
ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే
మమతమసకు సమదససత 
ముదమనసుత సుమనలయివ
సుసుతసహితగామం విరహరహిత భావం
ఆనందభోగం ఆ జీవకాలం
పాశానుబంధం తాళానుకాలం
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే

హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే
ఉదయాన్ని దాచే కురులింక నావే
ఒడిలోన వాలే నీ మోము నాదే
మధురాలు దోచే అధరాలు నావే
నీలో పరిమళం పెంచిందే పరవశం
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై

ఏదేదో ఆశ కదిలింది నాలో
తెలపాలనంటే సరిపోదు జన్మ
ఏ జన్మకైనా ఉంటాను నీలో
ఏ చోటనైనా నిను వీడనమ్మ
కాలం ముగిసినా ఈ బంధం ముగియునా
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే

కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది
నీ పేరు ప్రాణనాడి అయినదే... ఓఓఓ..
 0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.