శనివారం, ఫిబ్రవరి 13, 2021

అలా మేడ మీదా...

నెక్స్ట్ నువ్వే చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నెక్స్ట్ నువ్వే (2017)
సంగీతం : సాయి కార్తీక్  
సాహిత్యం : కృష్ణకాంత్   
గానం : యాసిన్ నిజార్ 

అలా మేడ మీదా 
ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జాణై
అలా మేడ మీదా 
ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జాణై
మేఘంలా నేనే మారనా 
నిన్నే చేరనా తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా 
నిన్నే చూడగా తారే నేనవనా

అలా మేడ మీదా 
ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జాణై

సిన్నీ సేతుల మీద 
పొన్నా పూలన్నివాలి 
పన్నీరు చల్లేనా
మున్నా జూవ్వాల మీద 
పచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి 
అద్దాల రైకగట్టి మాఇంతి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి 
చంద్రాల కోకసుట్టి మాఎంకి మెరిసేనా

వేవేల పూల పుట్టతేనే 
పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే 
బుట్ట బొమ్మ నీవేలే
తప్పిపోయావే నువ్ కచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా 
కనే కలే కనాలనే

అలా మేడ మీదా 
ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జాణై
మేఘంలా నేనే మారనా 
నిన్నే చేరనా తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా 
నిన్నే చూడగా తారే నేనవనా

అలా మేడ మీదా 
ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జాణై
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.