శనివారం, ఫిబ్రవరి 20, 2021

అనగనగనగా అరవిందట...

అరవిందసమేత చిత్రం లోని ఓ చక్కని ప్రేమ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అరవిందసమేత (2018)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : అర్మాన్ మాలిక్

చీకటి లాంటి పగటిపూట 
కత్తుల్లాంటి పూలతోట 
జరిగిందొక్క వింతవేట 
పులిపై పడిన లేడి కథ వింటారా?

జాబిలి రాని రాతిరంతా 
జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంతా 
గుండెల్లోకి దూరి అది చూస్తారా?

చుట్టూ ఎవ్వరూ లేరూ 
సాయం ఎవ్వరూ రారూ
చుట్టూ ఎవ్వరూ లేరూ 
సాయం ఎవ్వరూ రారూ
నాపై నేనే ప్రకటిస్తున్నా 
ఇదేమి పోరూ 

అనగనగనగా 
అరవిందట తన పేరూ
అందానికి సొంతూరూ 
అందుకనే ఆ పొగరూ..

అరెరరెరరెరే.. 
అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. 
అన్యాయం కదా ఇది 
అనరే ఎవ్వరూ..

ప్రతినిమిషమూ తన వెంట 
పడిగాపులే పడుతుంటా
ఒకసారి కూడ చూడకుంది క్రీగంటా
ఏమున్నదో తన చెంతా 
ఇంకెవరికీ లేదంతా 
అయస్కాంతమల్లె 
లాగుతుంది నన్నూ
చూస్తూనే ఆ కాంతా 
తను ఎంత చేరువనున్నా
అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా
అంతా మాయలా ఉంది 
అయినా హాయిగా ఉంది
భ్రమలా ఉన్నా బానే ఉందే 
ఇదేమి తీరు!!

మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?

అనగనగనగా.. 
అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. 
అందుకనే ఆ పొగరూ..

అరెరరెరరెరే.. 
అటు చూస్తే కుర్రాళ్లూ..
అసలేమైపోతారూ.. 
అన్యాయం కదా ఇది 
అనరే ఎవ్వరూ..

మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
మనవే వినవే అరవిందా.. 
సరెలే అనవే కనువిందా..
మనకి మనకి రాసుందే.. 
కాదంటె సరిపోతుందా?
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.