శనివారం, ఫిబ్రవరి 27, 2021

నేడే నాకు నేను...

చూసీ చూడంగానే చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చూసీ చూడంగానే (2020)
సంగీతం : గోపీ సుందర్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : గోపీ సుందర్ 

నేడే నాకు నేను 
పరిచయమౌతున్నా
నీలో నన్ను చూసి 
పరవశమౌతున్నా
సెకనుకు పదిసార్లు
నీ పేరంటున్నా
నేనోసారైనా
నాకు గుర్తు రాకున్నా
కవినేమ్ కాకున్నా
కవితలు రాస్తున్నా
తెలియని రంగుల్లో
నీతో కలలుకంటున్నా

ఇన్ని నాళ్ళుగా
నిన్ను చూపని
నిన్న మొన్నపై 
కోపమున్నదే
నిన్ను చూడక
నిన్ను కలవక
తెల్లవారదే రోజు గడవదే
ప్రేమనూ మరోటనూ
నువ్వు నా నిజం
నిండుగా నువ్వై
మారనీ జగం
నా నిను విడిచి
నిమిషం కదలదుగా

ఎదుట నిలిచిన
కలిసి గడిపిన
ఎంతకీ చెలి తనివి తీరదే
తలపు తలపున
నిన్ను కోలిచినా
ఎందుకో మరి దాహం మారదే
నేలపై నేరుగా దేవతై నువ్వే
వాలినావిలా లాలి పాడగా
నీ కలయికలో
మనసే వెలిగినదే
ఏంటా కోపమంతా 
చూడలేను నీలోనా
నువ్వే దూరమైతే 
మనసిది నిలిచేనా
అలగకే నాపైనా
ఉరమకే ఏమైనా
 
నిన్ను వీడి క్షణమైనా
నేను ఉండలేనన్నా
ఎవరే నీ కన్నా
నిన్ను నమ్ముకుని నేనున్నా
మాటలాడి మన్నించి
మరల కలిసిపోమన్నా
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.