మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

నమస్తేస్తు మహా మాయే...

ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చే రోజు. నైవేద్యంగా రవ్వకేసరీ లేదా పెసర పునుగులు సమర్పించాలని అంటారు. నేడు 'శ్రీదేవీ మూకాంబిక' చిత్రంలోని ఈ మహాలక్ష్మి అష్టకాన్ని గుర్తు చేసుకుందామా. కన్నడలోని కొల్లుర శ్రీ మూకాంబిక అనే చిత్రానికి అనువాదమే ఈ సినిమా. ఇందులో ఈపాట చిత్రీకరణ బాగుంటుంది ముఖ్యంగా అమ్మవారిని స్థుతించే బాలవటువు అభినయంం అద్భుతం.
 

చిత్రం : శ్రీదేవీ మూకాంబిక (1993)
సంగీతం : పుహళేంది.మహదేవన్
సాహిత్యం : ఆదిశంకరాచార్య - మహాలక్ష్మి అష్టకం
గానం : హేమాంబిక/విజయలక్ష్మి 
 
నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తె
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

నమస్తే గరుఢారుఢే
ఢోలాసుర భయంకరీ
సర్వ పాప హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

సర్వగ్నే సర్వ వరదే
సర్వ దుష్ట భయంకరీ
సర్వగ్నే సర్వ వరదే
సర్వదుష్ట భయంకరీ
సర్వదుఖః హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధి బుద్ధి ప్రదే దేవి
భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

ఆద్యంత రహితే దేవి
ఆది శక్తీ మహేశ్వరీ
ఆద్యంత రహితే దేవి
ఆది శక్తీ మహేశ్వరీ
యోగగ్నే యోగ సంభుతే
మహాలక్ష్మీ నమోస్తుతే

స్థూలసూక్ష్మే మహారౌద్రే
మహాశక్తీ మహొదరే
మహాపాపా హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

పద్మాసన స్థితే దేవీ
పర బ్రహ్మ స్వరూపిణీ
పద్మాసన స్థితే దేవీ
పర బ్రహ్మ స్వరూపిణీ
పరమేశ్వరి జగన్మాత 
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

శ్వేతాం భరధరే దేవీ
నానా లంకార భుషితే
శ్వేతాం భరధరే దేవీ
నానాలంకార భుషితే
జగత స్థితే జగన్మాత
మహా లక్ష్మీ నమోస్తుతే

మహా లక్ష్మీ నమోస్తుతే
మహా లక్ష్మీ నమోస్తుతే

సోమవారం, సెప్టెంబర్ 29, 2014

శ్రీ లలితా శివజ్యోతీ...

ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఈరోజు దద్ద్యోజనం లేదా పెరుగు గారెలు నైవేద్యంగా పెట్టాలంటారు. ఈ సందర్బంగా రహస్యం సినిమాలోని ఈ పాటను తలచుకొందామా. లీల గారి గొంతులో ఖంగుమంటూ మోగే ఈ పాట వినని, తెలియని తెలుగు వారు ఉండరేమో. ఈ పాట ఆడియో కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : రహస్యం (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం : పి.లీల

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్న చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళగా జ్యోతుల కప్పురహారతి
సకలనిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా...

ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. చిల్లుల్లేని అల్లం గారెలు లేదా మినప సున్నుండలు నైవేద్యంగా పెట్టాలని అంటారు. ఈ సందర్బంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో సుశీల గారు పాడిన ఈ చక్కని పాటను తలచుకొందామా. తనువులోని ఐదు అంశలు నింగీ, నేలా, నీరు, నిప్పు, గాలి నీ సేవకే ఉపయోగించాలనుంది అని చెప్తూ రామబ్రహ్మం గారు రాసిన ఈపాట చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ ఆల్బమ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.

ఆల్బమ్ :  ఉమాశంకర స్తుతిమాల (1982)
సంగీతం : ఉపేంద్ర కుమార్
సాహిత్యం : బేతవోలు రామబ్రహ్మం
గానం : పి.సుశీల

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
విశ్వైకనాథుడే విచ్చేయునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంటా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా తనువునో తల్లి నీ సేవ కొరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి
నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
 


నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి
నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా,
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

 

శనివారం, సెప్టెంబర్ 27, 2014

శివ మనోరంజని...

శరన్నవరాత్రులలో ఈ రోజు అమ్మవారు సకల వేదస్వరూపిణి అయిన గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలని అంటారు. ఈ సందర్బంగా గాయత్రీ మాత శ్లోకాన్ని విందామా. 'రహస్యం' సినిమాలో ఎస్వీరంగారావు గారి అభినయంలో ఘంటసాల గారి గాత్రంలో ఉన్న ఈ శ్లోకం వినడానికి చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది.


ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
గాయత్రీం భజే...
 
~*~*~*~*~*~*~*~

అలాగే బాలమురళీకృష్ణ గారి గాత్రంలో 'శివ మనోరంజని' అనే ఈ చక్కని పాటను కూడా తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పేదరాశి పెద్దమ్మ కథ (1968)
సంగీతం : ఎస్పీ కోదండపాణి
సాహిత్యం : చిల్లర భావనారాయణరావు 
గానం : బాలమురళీ కృష్ణ గారు 
 
శివ మనోరంజని 
వరపాణీ సర్వరాణీ 
కనవే జననీ కృప బూనీ
 ఆఆఆఆఆ....
శివ మనోరంజని 
వరపాణీ సర్వరాణీ 
కనవే జననీ కృప బూనీ

కవికే కనరాని కాంతివి నీవై 
కవికే కనరాని కాంతివి నీవై 

శ్రుతిలో లయగా సాగే సతివై 
శ్రుతిలో లయగా సాగే సతివై 
అభినయ శిల్పాల అలరే కళవై 
 అభినయ శిల్పాల అలరే కళవై 
సరస రసిక జన హృదయ కమలముల 
వెలుగు కిరణముగ తళుకులొలికితివి 

శివ మనోరంజని  

మెరసే జలదాల మేదుర నాదం
మెరసే జలదాల మేదుర నాదం 
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం 
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా

సలలిత గాంధర్వ వరగానమునా 
సలలిత గాంధర్వ వరగానమునా 

రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ 
నటనముల సలుపుమిట 

శివ మనోరంజని 
శివ మనోరంజని
 శివ మనోరంజని 
 

శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

దేవీ త్రిభువనేశ్వరీ...

ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. చిత్రాన్నము లేదా పులిహోర నైవేద్యముగా సమర్పించి పూజించుకునే రోజు. ఈసందర్బంగా మధురమీనాక్షి చిత్రంలోని దేవీ త్రిభువనేశ్వరి అనే ఈ పాటను తలచుకొందామా. ఊయలలో ఉన్న బాలని సాక్షత్ లక్ష్మీ సరస్వతులు ఆటపాటలతో అభివర్ణించే అపురూపమైన ఘట్టమిది. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మధురమీనాక్షి (1989)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : వాణీజయరాం

దేవీ త్రిభువనేశ్వరీ
దేవీ త్రిభువనేశ్వరీ 
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
మధురాపురి విభుని
మనసున మురిపించ
మహి వెలసిన తల్లివే
నీవు మణిమయ తేజానివే... 
దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

చిరునవ్వు భువికెల్ల ఆనందమే..
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చిరునవ్వు భువికెల్ల ఆనందమే
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చరితార్ధులను చేయు నీ చరణమే
సకలార్ద విజ్ఞాన సందోహమే... 

దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

భక్త తతికెల్ల శక్తివై నిలుచు ముక్తి దాత నీవే
తక్క తకధీంత తక్క తకఝంత తకట తఝుణు తకతా
నీ దర్శన భాగ్యానికి కాచేనట వేచేనట ఈ జగమే 
తద్దింతక తఝ్ఝుంతక తద్దింతక తఝ్ఝుంతక తకఝణుతా 
పరాకేల జగన్మాత దిగంతాల మొరాలించు దేవతవే 
తఝంతంత తఝంతంత తఝంతంత తఝంతంత తకధిమిత 
నీతి నిలుపుటకు కూర్మి నెరపుటకు పృథివిపై నీవు వెలసితివే 
తకిట తకధీంత తకిట తకధీంత తకిట తకధీంత తకఝణుత 
దేవీ మాతా జగతీ నేతా కల్పకవల్లి 
తకఝం తఝణం తకఝం తఝణం తరికిటతోం తరికిటతోం 
ముద్దులు చిందే ముచ్చటలొలికే మోహన రూపిణి సుహాసిని 
తాంతక ధీంతక తోంతక నంతక తాంతక ధీంతక తధింతత 
నీ పద యుగములు నమ్మిన వారికి ఆశ్రయమీయవె విలాసిని 
తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తధీంతత 
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట  
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట
చూపులు మోహనం నగమే చందనం 
అభయం జగతికే.. 
 
దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

గురువారం, సెప్టెంబర్ 25, 2014

అంబికా నర్తనం...

ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు దేవీ అవతారాలను తలచుకుంటూ అందుకు సంబంధించిన పాటలను గుర్తు చేసుకుందామా... మిత్రులందరకూ శరన్నవరాత్రి శుభాభినందనలు. నేడు మొదటి రోజు స్వర్ణకవచాలంకృతా దేవి అవతారం. ఆ దేవికి కనకకవచాన్ని అలంకరించి కట్టు పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించి పూజించే రోజు. ఈరోజు పరాశక్తి మహిమలు సినిమాలోని అంబికా నర్తనం అనే ఈ పాటను గుర్తు చేసుకుందాం. శ్రావ్యమైన సంగీతంతో చక్కని చిత్రీకరణతో కూడిన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : పరాశక్తి మహిమలు (1972) 
సంగీతం : టి.కె.రామమూర్తి, చక్రవర్తి
సాహిత్యం : ఏ.ఎస్.రావు
గానం : పి.సుశీల 

అంబికా నర్తనం.. అంబికా నర్తనం 
శాంతం ప్రళయం నటించూ తల్లి 
భవ్య మూర్తి కాదా... 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం...

మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును 
మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును
వింతగ మెరుపల్లె నూలాడును 
వింతగ మెరుపల్లె నూలాడును
నర్తించు అంబతో.. నర్తించు అంబతో
లోకాలు పాడుచు ఆడుచు నటించు

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నర్తించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును 
చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును
సుందర ముఖం ఎదల మురిపించును
సుందర ముఖం ఎదల మురిపించును 
ఎవ్వరు బాధలో కుమిలినా 
దేవియే సుఖములు కురియులే
ఎవ్వరు పదముల వ్రాలినా 
దేవియే బ్రోచులే కాచులే
మాతను పూజించి తరియించు జగములు 
అంబయే ఇచ్చును కోరిన వరములు 
మరులకు సురలకు దర్శనం 
నిత్యము జీవనం నాకు 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

సకల కళా వల్లభుడా...

ప్రేమ, పెళ్ళి అంటే తనకి అసహ్యమంటూనే చివరికి ఒక డాక్టర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకునే పాత్రలో ఆద్యంతం హాస్యాన్ని పండించిన కమల్ హాసన్ 'బ్రహ్మచారి' సినిమాకి పెద్ద ఎసెట్. పూర్తిగా హాస్యం మీదే ఆధారపడి నడిచే ఈ సినిమాలోని ఈ ప్రేమగీతం నాకు నచ్చిన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బ్రహ్మచారి (2002)
సంగీతం : దేవా
రచన : శివ గణేష్
గానం : శ్రీనివాస్, సుజాత

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా 
సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నువ్వు పెనవేస్తే శృంగారవీణ పదే పదే మోగాలా
కలవా చెలీ కానుకవా మదినే గిచ్చే మల్లికవా

కన్నె వన్నె చూసి కలుగు భావమేది
కళ్ళలోన ప్రేమా? కామమా? ఏదీ ఏదీ
కమ్మనైన స్నేహం గుండె నిండుతుంటే
కాలమంత వెలిగే బంధమే అది అదీ
ఆ మాటే చాలంట నీ మనసుకి బానిసనవుతా
నీ రాజ్యం ఏలేస్తా నీ శ్వాసై నిత్యం నిన్నే ప్రేమిస్తా

రాయి వంటి నాలో రాగాలొలికినావే
రాయభారమింకా ఎందుకే అహొ ప్రియా ప్రియా
వేసవంటి నేను వెన్నెలైన వేళా
హాయి భారం తీరేటందుకే మహాశయా
నీ జోరే సెలయేరై నను నీలో ముంచెయ్యలా
నీ జ్వాలే నా చీరై నా తనువే కాగి వేగిపోవాలా

సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నను ఒడిచేర్చి నిను పంచువేళ ప్రాయం ప్రాణం ఊగాలా

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

What a waiting...

"అందమైన అనుభవం" సినిమా కోసం బాలచందర్ గారు సింగపూర్ లోని జురాంగ్ బర్డ్ పార్క్ లో చిత్రీకరించిన ఈపాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే గిటార్ పై లైట్ గా సాగే సంగీతం మనసుకు హాయైన అనుభూతిని ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి 
కళ్ళు కాయునంతదాక 
చెప్పవమ్మ చెప్పవమ్మ 
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న 
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు 
ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి 
కళ్ళు కాయునంతదాక 
చెప్పవమ్మ చెప్పవమ్మ 
చుప్పనాతి రామచిలక


సోమవారం, సెప్టెంబర్ 22, 2014

ఏమిటిది ఏమిటిది...

బాలు గారు స్వరపరచిన అతికొద్ది సినిమాలలో ఒకటైన "తూర్పు వెళ్ళే రైలు" లో ఒక అందమైన మెలోడీ ఈ రోజు మీకోసం. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. వాటిలో ప్రత్యేకించి ఈ పాటను సుశీల గారు పాడిన విధానం అద్భుతం. టీనేజ్ లో ఈ పాట వినడం ఒక మధురమైన అనుభూతి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979) 
సంగీతం : బాలు 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : సుశీల 
 
ఏమిటిది ఏమిటిదీ ? 
ఏదో తెలియనిదీ.. 
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ?
ఏమిటిదీ ? 
ఏమిటిది ఏమిటిదీ ? 
ఏదో తెలియనిది..
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ?
ఏమిటిదీ ?

హత్తు కున్న మెత్తదనం 
కొత్త కొత్తగా ఉంది..
మనసంతా మత్తు కమ్మి 
మంతరించినట్లుంది..
నరనరాన మెరుపు తీగె 
నాట్యం చేసేస్తోంది..
నాలో ఒక పూల తేనె నదిలా 
పొంగుతోంది పొంగుతోంది...

ఏమిటిదీ.. ? 
ఏమిటిది ఏమిటిదీ ?

ఈడు జోడు కుదిరింది..
తోడు నీడ దొరికింది..
అందానికి ఈనాడే 
అర్ధం తెలిసొచ్చింది..
పెదవి వెనక చిరునవ్వు 
దోబూచులాడింది..
చిలిపి చిలిపి తలపు 
తలచి సిగ్గు ముంచుకొస్తోంది..

ఏమిటిదీ.. ? 
ఏమిటిది ఏమిటిదీ ?
ఏదో తెలియనిది.. 
ఎప్పుడూ కలగనిది
కలకానిదీ..
ఏమిటిదీ ? 

ఆదివారం, సెప్టెంబర్ 21, 2014

గుడిగంటలా నవ్వుతావేలా...

ఆర్పీ పట్నాయక్ చేసిన మెలోడీలలో ఒక మంచి పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : ఎస్.పి.బి.చరణ్ , ఉష

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీవైపలా చూస్తుంటె ఆకలేయకుంది
నీ చూపులొ బంధించె మంత్రమె ఉన్నది
నీ మాటలె వింటుంటె రోజు మారుతుంది
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నది
మనసెందుకొ ఇలా మూగబోతోంది రామ
తెలియదు
మరుమల్లె పువ్వుల గుప్పుమంటోంది లోన
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీ నీడలొ నేనున్నా చూడమంటున్నది
ఈ హాయి పేరేదైన కొత్తగా ఉన్నది
నా కంటినే కాదన్న నిన్ను చూస్తున్నది
నేనెంతగా వద్దన్నా ఇష్టమంటున్నది
మరి దీనినేకద లోకమంటుంది ప్రేమా
తెలియదు
అది దూరమంటూనె చేరువౌతుంది రామ
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు

శనివారం, సెప్టెంబర్ 20, 2014

చెలియా చెలియా...

దేవీశ్రీప్రసాద్ పాటలలో ఇలాంటి జానపదం టచ్ ఉన్న పాటలది ఒక ప్రత్యేకమైన స్థానం. కలుసుకోవాలని సినిమా కోసం చేసిన ఈపాట నాకు మూడ్ స్వింగ్స్ లో ఉన్నపుడు హుషారు తెప్పించడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరూ విని చూసీ ఎలా ఉందో చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కలుసుకోవాలని (2002)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : కులశేఖర్  
గానం : దేవీశ్రీప్రసాద్, కల్పన

చెలియా చెలియా సింగారం 
చిటికెడు నడుమె వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావ బావ బంగారం 
అతిగా నాన్చకు యవ్వారం
ఈ పూటైనా తీర్చెయవా నా భారం

ఓ చెలి అరె అలా పొడిగించకే కధే ఇలా
చాటుగా అదీ ఇదీ మరియాదా
రా ప్రియా అదేంటలా అరిటాకుల మరీ అలా
గాలి వాటుకే ఇలా భయమేలా

చెలియా చెలియా సింగారం 
చిటికెడు నడుమె వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం..

సోకులను ఆరేసి నా మదికి వల వేసి
లాగకికా వన్నెల వయ్యారీ..
కొరికలు రాజేసి కోక నను వదిలేసి
నాకు ఇక తప్పదు గొదారి..
ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు
అమ్మమ్మా నిన్నింక నమ్మేదెలా
ముద్దుల్లో ముంచెత్తి నా మొక్కు చెల్లించు
ముద్దయిలా నువ్వు కుర్చోకలా
వాగల్లే వస్తావు వాటేసుకుంటావు
చీ పాడు సిగ్గంటూ లేదే ఎలా
దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు 
ఈ మాయ చెప్పేదెలా

మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి
పెట్టకిక నాతో ఈ పేచీ..
కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి
ఆడెనటా మనతో దోబూచి..
అబ్బబ్బా అబ్బాయి జుబ్బాల బుజ్జాయి
యెన్నెన్ని పాఠాలు నెర్పాలిలా
అందాలా అమ్మాయి మోగిస్త సన్నాయి
అందాక హద్దుల్లో ఉండాలలా
కల్లోకి వస్తావు కంగారు పెడతావు
నాకర్ధమె కాదు నీ వాలకం
వొళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు 
అయ్యాగా నీలో సగం

చెలియ చెలియ సింగారం 
చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావా బావా బంగారం 
అతిగ నాంచకు యెవ్వారం
ఈ పుటైనా తీర్చెయ్యవా నా భారం

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

అనగా అనగనగా...

ఈమధ్య విడుదలైన కొత్త పాటలలో విన్నవెంటనే ఆకట్టుకున్న సరదా ఐన పాట ఇది. ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. "ప్రస్థానం" సినిమాలో సీరియస్ రోల్ తో ఆకట్టుకున్న శర్వానంద్ ఈ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ రోల్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో తన డ్రెస్సింగ్ తో మొదలుకొని డాన్స్ వరకూ అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. కలర్ ఫుల్ గా మంచి ఎంటర్ టైనింగ్ గా చక్కని రిధమ్ తో సాగిన ఈ పాట చూసీ వినీ మీరూ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : రన్ రాజా రన్ (2014)
సంగీతం : జిబ్రాన్
సాహిత్యం : శ్రీమణి
గానం : గోల్డ్ దేవరాజ్
 
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బెత్తెడంటి నడుము పిల్ల పుత్తడి బొమ్మ రా
గోళీల్లాంటి కళ్లతోటి గోల్ మారు పోరి రా
హేయ్ ఘాగ్ర చోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తాను రా

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి

చలాకీ.. పరిందా కావాలా మిరిందా
బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లలా
బుల్లి అడుగులేసె బుజ్జి కుక్క పిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డీ బేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటి పాపలా
హేయ్ అచ్చంగా అందంగా దోస్తీ చేసే మస్తాని
సాయంత్రం రమ్మంది వెళ్ళి మళ్ళీ వస్తానే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి

రూపంలో.. ఏంజెల్ రా కోపంలో.. డేంజర్ రా
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్ల రా
ముక్కుసూటి మాటలాడు కొంటె పిల్ల రా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డు రా
పంచులేసి పరువు తీసె బబ్లి గర్లు రా
లడాయే వచ్చిందో లడికి భలే హుషారే
బడాయే కాదంట మేరే బాత్ సునోరే

బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి

అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్‌వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్‌బుల్లి


గురువారం, సెప్టెంబర్ 18, 2014

సరిగమలు గలగలలు...

ఈ బ్లాగ్ పేరుకి ప్రేరణగా నిలచిన పాటని నేనింతవరకూ పోస్ట్ చేయలేదని చూసుకుని ఆశ్చర్యపోయాను. బాలచందర్ గారి సినిమాల్లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారు స్వరపరచే అన్నిపాటలు బాగుంటాయి. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ మరోసారి తలచుకోండి. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇది కథ కాదు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ 
చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో...
సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు 
 
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో

కదిలీ కదలక కదిలించు కదలికలు
కదిలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు

సరిగమలూ గలగలలు.. 
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
 
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు

సరిగమలూ గలగలలు...  
సరిగమలూ గలగలలు

నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో  
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

సరిగమలు గలగలలు...
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా


బుధవారం, సెప్టెంబర్ 17, 2014

ఉండాలీ నీ గుండెల్లో...

ఈ బ్లాగులో తరచుగా నాకు రేడియో పరిచయం చేసిన పాటలంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అలాగే ఈ పాట నాకు టీవీ పరిచయం చేసిన పాట. టీవీ అంటే దూరదర్శన్ ఛానల్స్ మాత్రమే అందుబాటులో ఉన్న తొలిరోజుల్లో ప్రతి గురువారం రాత్రి ఎనిమిదింటికి చిత్రలహరి ప్రోగ్రాం వచ్చేది అందులో ఈ పాట కొంతకాలం రెగ్యులర్ గా వచ్చేది. మొదటిసారి అక్కడ చూసే అభిమానించాను. నాకు నచ్చిన ఈ మెలోడీని మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : విజేతలు (1987)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి

ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా

పూలగంధాలు పలికేను నేడు ముద్దు మురిపాలనే
పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు ఊరించెనే
సందె వెలుగుల్లో నయనాలు నేడు సుధలు చిలికించవా
రాగతీరాల దరిచేరి కదిలే ఎదలు పులకించవా
ఏవేవో ఆశలు పూచే ఏకాంతా వేళా
గారాలా బంధాలన్ని కదిలేటీ వేళా
వంత పాడిందీ ప్రేమ బంధం 
లేదంట ఈ సాటి యోగం

ఉండాలీ నీ గుండెల్లో నేనే నీవుగా

జన్మ జన్మాల నా తోడు నీడై నీవు ఉండాలిలే
చెలికి నీ చెలిమి కావాలి చూడు నీవు నా ఊపిరే
నింగి ఈ నేల స్థితి మారుతున్నా స్నేహమే మారునా
కాలగతులన్ని మారేను గాని హృదయమే మారునా
ఉంటానూ నీతో నేను నీ తలపే వేదం
నాదేలే నీలో సర్వం నీ పిలుపే నాదం
మనదిలే ఇంక ప్రేమ లోకం 
ఇది కాదె రాగానురాగం

ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా


మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

గోపాల కృష్ణుడు నల్లనా...

ఈ రోజు వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కన్నయ్య పాటను తలచుకుందామా. రావుబాలసరస్వతి గారు పాడిన ఈపాట చాలా చాలా బాగుంటుంది. ఈ క్రింది ప్లగిన్ లోడ్ అవకపోతే ఈపాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రాధిక (1947) 
సంగీతం : సాలూరి హనుమంతరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం గారు
గానం : రావు బాలసరస్వతి 

గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా 

మా చిన్ని కృష్ణయ్య లీలలూ 
ఆఆఅ..ఆఆఅ..ఆఆఆఆఆఅ...
మా చిన్ని కృష్ణయ్య లీలలూ
మంజులమగు మురళి యీలలూ 
మా కీర శారికల గోలలూ 
మాకు ఆనంద వారాశి ఓలలూ 
మాకు ఆనంద వారాశి ఓలలూ 

గోపాల కృష్ణుడు నల్లనా 

మాముద్దు కృష్ణుని మాటలు 
మరువరాని తేనె తేటలు 
మాముద్దు కృష్ణుని మాటలు 
మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలూ 
మమ్ము దరిజేర్చు తిన్నని బాటలూ
మమ్ము దరిజేర్చు తిన్నని బాటలూ
 
గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా 

~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ చక్కని యానిమేషన్ ని కూడా చూసి ఆ కన్నయ్యలీలలను మనసారా మరోసారి తలచుకుందాం.


సోమవారం, సెప్టెంబర్ 15, 2014

ఎపుడెపుడెపుడని...

నిర్ణయం సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఈ పాట నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నిర్ణయం (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, జానకి

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...  
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ వియ్యాలతో..
పద పద పదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం

తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
నా ఉదయమై వెలిగే ప్రియవరం

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ వియ్యాలతో..
అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా 
సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం
వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం
రా వెతుకుదాం రగిలే రసజగం 

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో


ఆదివారం, సెప్టెంబర్ 14, 2014

చిన్నదానా ఓసి చిన్నదానా...

ప్రేమకథా చిత్రాలలో చూడకుండా ప్రేమించుకోవడమనే ఒక కొత్త ట్రెండ్ కు తెర తీసిన 'ప్రేమలేఖ' సినిమాలో హుషారుగా సాగే ఈ పాట చాలా బాగుంటుంది. దేవా హాయైన ట్యూన్ కి భువనచంద్ర గారి సరదా లిరిక్స్ తోడై మంచి వినోదాన్ని పంచుతాయి. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవా
సాహిత్యం : భువనచంద్ర
గానం : ఆర్.కృష్ణరాజ్

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు 
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల
ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక 
రెండోమూడో  ఇళ్ళిస్తానే బుల్లేమ్మా
ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి
నా పక్కన వుండక్కర్ల జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తేక్కిస్తుందే .. బడబడబడమని
నామస్సుని తోందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార
ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్

సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ 
లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
లాకెట్టులో లారాకాంబ్లీ  నోట్ బుక్లో సచిన్ జాక్సన్
హెయిర్  కట్ కు  బ్యూటీపార్లర్  ఏలమ్మా

నీతలంపే మత్తేక్కిస్తుందే .. బడబడమని
నా మనసుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని 
తట్టినన్ను లాగేస్తున్నాయే   ఓ .. ఓ .. ఓ ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు 
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.