బాపుగారి సినిమాలలో అణువణువు తెలుగుదనంతో నిండి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఓ అమ్మాయి సొగసు తన అందాలలోనే కాదు తాను చేసే పనులలో కూడా ఉంటుందని బహు చక్కగా వర్ణించే ఈపాటని ఇష్టపడనివారు ఎవరు ఉంటారు చెప్పండి. కీరవాణి గారి కమ్మనైన సంగీతం వేటూరి గారి చక్కని సాహిత్యం బాపు గారి సొగసైన చిత్రీకరణ వెరసి ఈ పాట ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసేసుకుంది. నాకు చాలా ఇష్టమైన ఈపాటను మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
సొగసు చూడ తరమా
హా హా హా హా
సొగసు చూడ తరమా
హ హ హ హ
నీ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు
ఎర్రన్ని కొపాలు ఎన్నెన్నో దీపాలు
అందమే సుమా
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
అరుగు మీద నిలబడి
నీ కురులను దువ్వే వేళ
చేజారిన దువ్వెన్నకు
బేజారుగ వంగినప్పుడు
చిరు కోపం చీర గట్టి
సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం
పరుగో పరుగెట్టినప్పుడు
ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
పెట్టీ పెట్టని ముద్దులు
ఇట్టే విదిలించి కొట్టి
గుమ్మెత్తే సోయగాల
గుమ్మాలను దాటు వేళ
చెంగు పట్టి రా రమ్మని
చలగాటకు దిగుతుంటే
తడి వారిన కన్నులతో
విడు విడు మంటున్నప్పుడు
విడు విడు మంటున్నప్పుడు
ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
పసిపాపకు పాలిస్తూ
పరవశించి వున్నప్పుడూ
పెద పాపడు పాకివచ్చి
మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి
ఛీ పొండి అన్నప్పుడు
నా ఏడుపూ హహహ
హహహ నీ నవ్వులూ
హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
సిరి మల్లెలు హరి నీలపు
జడలో తురిమీ
క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తొలి కోకల
ముడిలో అదిమీ
మనసే సొలసీ కన్నులు వాచి
నిట్టూర్పులా నిశి రాత్రి తో
నిదరోవు అందాలతో
త్యగరాజ కృతిలో
సీతాకృతి గల ఇటువంటీ
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
2 comments:
మధ్య తరగతి ఇల్లాలి సొగసు మన బాపు తప్ప మరెవరివల్లైనా చూపించ తరమా..
చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు.. థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.