గురువారం, జులై 31, 2014

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు...

బాలసుబ్రహ్మణ్యం గారు మొదటిసారి సంగీత దర్శకత్వం వహించిన "కన్యకుమారి"  చిత్రంలోని ఒక చక్కని మెలోడి ఈ రోజు మీకోసం. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో దాసరి గారు మాట్లాడుతూ... వేటూరి గారు ఎంతో అభిమానించి రాసుకున్న ఈ సాహిత్యాన్ని ఒక దర్శకుడు తిరస్కరించారని బాధపడుతుంటే తాను ఈ సినిమాలో సంధర్బానుసారంగా ఉపయోగించుకున్నాను అని చెప్పారు. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో ఈ కింది ఎంబెడెడ్ విడ్జెట్ లో వినవచ్చు.. అది లోడ్ అవకపోతే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు.చిత్రం : కన్యకుమారి(1977)
సంగీతం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల 

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు 
తెలియదు నాకు పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు 

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు 

ఇరుసంజెల పిలుపుల నడుమ 
మరుమల్లెల వలపే మనది 
ఇరు పెదవుల ఎరుపుల నడుమ 
చిరునవ్వుల పిలుపే మనది 

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు 

సిరివెన్నెలొలుకు సిగమల్లె తెలుపు 
చిరునవ్వులోని మరుమల్లె తెలుపు 
తొలిరోజులందు చెలిమోజులందు 
విరజాజులన్ని తెలుపు 
అరమూత కనుల నును లేత వలపు 
తెర తీసి నాకు పిలుపు 
తెలిగించి మనసు తెలుపు

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు 

చెలి కాటుక మబ్బుల వెన్నెల 
తొలి కోరిక మదిలో కోయిల
మన కలయిక సంధ్యారాగం 
ప్రతి రాగం జీవన రాగం

తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు 
తెలియదు నాకు పడమర తూరుపు 
తెలిసిందొకటే ఎరుపు నా చెలియ పెదవి ఎరుపు 
తొలిసంధ్యకు తూరుపు ఎరుపు
మలిసంధ్యకు పడమర ఎరుపు


బుధవారం, జులై 30, 2014

నా జీవన బృందావనిలో...

చక్రవర్తి గారు స్వరపరచిన పాటలలో కొన్ని కొన్ని పాటలు చాలా బాగుంటాయి, అలాంటి మధురగీతాలలో ఒకటి బుర్రిపాలెం బుల్లోడు సినిమా కోసం చేసిన ఈ పాట. కృష్ణ గారి పాటలలో ఎక్కువ నవ్వకుండా చూడగలిగిన పాట ఎందుకంటే దర్శకుడు చాలా తెలివిగా డాన్స్ బాధ్యత అంతా శ్రీదేవికి అప్పగించేసి కృష్ణ గారిని జస్ట్ నిలబెట్టేసి చిత్రీకరించేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : బుర్రిపాలెం బుల్లోడు(1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, సుశీల

నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ

నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే..
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే..
నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే..
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే..
మనసులో మధుర వయసు లో యమున కలిసి జంటగా సాగనీ..
మన యవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ..
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ..
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ..
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా

నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా ప్రాణమంతా నీ వేణువాయే
పులకింతలన్నీ నీ పూజ లాయే
యేయోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
యేయోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ

ఇంద్రధనసు పల్లకీలో..చంద్రుడల్లె నువ్వొస్తుంటే..
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే..
ఇంద్రధనసు పల్లకీలో..చంద్రుడల్లె నువ్వొస్తుంటే..
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే..
రాగలహరి అనురాగ నగరి రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణువై చెలరేగనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా అదే రాగ డోలా
అదే రాసలీలా అదే రాగ డోలా


మంగళవారం, జులై 29, 2014

ఏక్ దో తీన్ సఖీ ప్రియా...

ఇళయరాజా గారు స్వరపరచిన పాటలలో ఒక అందమైన పాట ఈ పాట. ఇందులో డాన్స్, చిత్రీకరణ, గాయనీ గాయకులు, సాహిత్యం వీటన్నిటికన్నా ఈ పాట ట్యూన్ నాకు ఎక్కువ ఇష్టం. పాటలో అక్కడక్కడ వచ్చే కోరస్ కానీ, పాటంతా వచ్చే రిధమ్ కానీ, చరణాల ముందు వచ్చే మ్యూజిక్ కానీ అసలు ఈ పాట ఎప్పుడు విన్నా మనసంతా ఒక ఆహ్లాదకరమైన అనుభూతితో నిండిపోతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రుద్రనేత్ర  (1989)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే
నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా 

అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా
అరె గోలీ మార్ దో ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా


సోమవారం, జులై 28, 2014

గోగులు పూచే గోగులు కాచే...

బాపు గారి సినిమాల్లో పాటలంటేనే అచ్చతెలుగుదనం ఉట్టిపడుతుంటుంది ఇక సినారేగారి మాటలలో కె.వి.మహదేవన్ గారి సంగీతంలో వచ్చిన పాటంటే చెప్పాల్సిన పనేముంది. వారి కాంబినేషన్ లో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల, కోరస్

గోగులు పూచే..గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచే..గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి 
ఓ లచ్చ గుమ్మాడి..ఈ..ఈ ఓ లచ్చ గుమ్మాడి 
 
పొద్దు పొడిచే పొద్దు పొడిచే..ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే..ఓ లచ్చా గుమ్మాడి 

 పొద్దు పొడిచే పొద్దు పొడిచే..ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే..ఓ లచ్చా గుమ్మాడి

పొద్దు కాదది.. నీ..ఈ..ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే..ఏ..సుమా..ఆ
పొద్దు కా..ఆ.దది.. నీ..ఈ..ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే..ఏ..సుమా..ఆ
వెలుగులు కావవి..నీ పాదాలకు అలదిన పారాణీ..
ఆహ..
హ..జిలుగులే సుమా..ఆ..ఆ

ముంగిట వేసిన ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి

ముంగిట వేసిన ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి

ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పా..ల కడలియే సుమా..ఆ
ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పా..ల కడలియే సుమా..ఆ
ముగ్గులు కావవి..నా అంతరంగాన పూచిన రంగవల్లులే..ఏ..ఏ..సుమా..ఆ..ఆ

మల్లెలు పూచే మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..
మల్లెలు పూచే మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..


మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ
మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ
వెన్నెల కాదది వేళ తెలిసి..ఆ జాబిలి వేసిన పానుపే..ఏ..ఏ..ఏ.. సుమా..ఆ..ఆ..ఆ
 

ఆదివారం, జులై 27, 2014

శ్రావణ వీణ స్వాగతం...

చిరుజల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈరోజునుండి మొదలవుతున్న శ్రావణమాసానికి ఈ చక్కని పాటతో ఆహ్వానం పలుకుదామా. ఈ పాటలో శ్రీదేవి డాన్స్ చాలా బాగుంటుంది తనని చిత్రీకరించడంలో వర్మ తన అభిమానమంతా చూపించాడనిపిస్తుంటుంది. పాట బీట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పై వీడియోలో పాటకు ముందు వచ్చే శ్రావణ వీణ బిట్ ఉంటుంది. పూర్తి పాట ఈ క్రింది వీడియో లో చూడచ్చు. చిత్రం : క్షణం క్షణం (1991)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి 
సాహిత్యం :  వెన్నెలకంటి
గానం : నాగుర్ బాబు(మనో), చిత్ర, డా.గ్రబ్    

శ్రావణ వీణ... స్వాగతం...
స్వరాల వెల్లువ వెల్ కమ్
లేత విరిబాల నవ్వమ్మా ఆ...నందంలో..

జుంబాయే హాగుంబహేయ జుంబాయే ఆగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
వయసాగనిది రేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే

అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే హే..హే..

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది

ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు

అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో 

ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు

చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో


చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే

లేత విరిబాల నవ్వమ్మా...

శనివారం, జులై 26, 2014

సిరిమల్లె సొగసు...

సత్యం గారి స్వరకల్పనలోని ఓ మధురగీతం ఈరోజు మీకోసం. ఏ.ఎం.రాజా గారి స్వరం డిఫరెంట్ గా బాగుంటుంది అలాగే ఈపాటలో సంగీతం సాహిత్యాలు కూడా అందంగా ఉంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : ఏ.ఎం.రాజా , పి.సుశీల

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ

ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
 
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు..
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు..
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


శుక్రవారం, జులై 25, 2014

తనేమందో అందో లేదో...

మిక్కీ జె.మేయర్ మొదట్లో సంగీతం అందించిన పాటలలో ఓ చక్కని పాట ఇది. గణేష్ సినిమా లోనిది.. ఇందులో పల్లవి అవగానే 'ననననన' అంటూ వచ్చే బిట్ నాకు నచ్చుతుంది. మెల్లగా పారే సెలయేరు మధ్యలో రాళ్ళెక్కువై ఇరుకైన చోట వడిగా ప్రవహించినట్లు పాటంతా మెల్లగా సాగుతూ ఆ బిట్ మాత్రం జలపాతపు హోరులా వినిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : గణేష్ (2009)
రచన : సిరివెన్నెల
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : జావేద్ అలీ

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది
లైఫంతా నాతో ఇలాగే ఉంటావా?

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో
ఈ వెలుగును దాచాలంటే...
పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో
మనసంతా ప్రేమైపోతే...
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో
మైమరపున నే నిలుచుంటే...
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

ఇదే క్షణం శిలై నిలవనీ
సదా మనం ఇలా మిగలనీ
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో... మదేం విందో...

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా

గురువారం, జులై 24, 2014

గ్రహణం పట్టని...

బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం సినిమాకోసం జొన్నవిత్తుల గారు రాసిన ఒక సరదా అయిన పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాధాగోపాళం (2005)
సంగీతం: మణి శర్మ
రచన : జొన్నవిత్తుల
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

అహో
విశ్వప్రేమ ప్రభాదివ్య సౌందర్య మాధుర్య సౌశీల్య
సాఫల్య సౌగుణ్య లావణ్య సమ్మోహినీ..
నాకు అర్ధాంగిగా నీవు భూలోకమున్ జేర
విభ్రాంత దిగ్భ్రాంత సుస్వాగతంబిచ్చితిన్ నిచ్చెలీ.. హా

సహో..ఒహో..
గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా
కావు కావుమని తపస్సు చేసి..దేహి దేహి అని దేవులాడితి..
దేవుడు ఇచ్చిన పెండ్లమా..ముద్దుల మిఠాయి పొట్లమా

అరెరే ఎర్రని పెదవులు.. మ్.హా
మెత్త మెత్తగా..గట్టి గట్టిగా..
మీగడ కట్టిన అమృతపు ముక్కలూ
పగడపు చిగురుల పెదవులు..
నా ప్రేమకి దొరికిన పదవులు
అబ్బబ్బో బుగ్గలు..వారెవా ఏం సిగ్గులు

పాల్కోవాలు..మాల్కోవాలు..మందారాలు..
బాదం పాలు..హుందాతనము..ఆరిందాతనము..
చిందులు వేసే చెక్కిళ్ళు..ఔరా
గోరు చిక్కుళ్ళు..ముద్దుతో నూరు నొక్కుళ్ళూ

కోటేరులా ఉండి కొట్టొచ్చినట్టున పట్టుదల పుట్టైన ముక్కు..
బుసలు కొట్టుట తనకు హక్కు !
నిక్కచ్చిగా భలే నిక్కు..కొనవంపులో ఉంది టెక్కు

కిల కిల కిల కిల నవ్విన చాలు..
తలలే వంచును ఇలలో పూలు
నవరత్నాలీ నవ్వుల ముందర నివ్వెరబోయే గవ్వలు

వన్నెలు చిలికి వెన్నెలు తీసే చిన్ని కవ్వమా నడుమా..
మదన మాన్యమా..శూన్యమా.. శూన్యమా..

కారబ్బంతుల పారాణులతో కళ కళ లాడే పదములు
భరత మహాముని గుండె సవ్వడుల తైతక ధిమి తక రిధములు
దాసుని తప్పుని దండించే..ధాం ..ధూం..ధాం .. ఆయుధములు !

స్వాగతం ..సుస్వాగతం .. స్వాగతం ..సుస్వాగతం


బుధవారం, జులై 23, 2014

మల్లె తీగవంటిదీ...

దర్శకురాలిగా విజయనిర్మల గారి మొదటి చిత్రమైన మీనా సినిమాలోని ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. మొదటి చరణంలో మల్లెపందిరిలా మగువ కూడా ఆసరా కోసం ఎలా చూస్తుందో వివరిస్తూ రెండో చరణంలో కుటుంబంలో ఆమె పోషించే ముఖ్యమైన పాత్రలను కూడా వివరించే ఈ చక్కటి పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మీనా (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ
తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ
ఇల్లాలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి
ఇల్లాలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి
తల్లికి పిల్లల ఆదరణ
పండు వయసులో కావాలీ
ఆడవారికీ అన్నివేళలా
తోడూనీడ వుండాలీ
తోడూనీడ వుండాలీ 

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకుపోయేనూ అల్లుకుపోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

నుదుట కుంకుమ కళ కళ లాడే
సుదతే ఇంటికి శోభా
నుదుట కుంకుమ కళ కళ లాడే
సుదతే ఇంటికి శోభా
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ
అనురాగం తో మనసును దోచే
వనితే మమతల పంటా
జన్మను ఇచ్చి జాతిని నిలిపే
జననియె జగతికి ఆధారం
జననియె జగతికి ఆధారం 

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకుపోయేనూ అల్లుకుపోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

మంగళవారం, జులై 22, 2014

సురమోదము...

ఆదిత్య 369 లోని మరో మంచి పాట ఇది ఇళయరాజా గారి స్వరసారధ్యంలో వేటూరి గారి రచన... ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి, సునంద

తా..తకతాం..తకితాం..తక తకిట దిత్తై..
తకిటతై తత్ తరికిటతాం..
తకతకిట తకతధిమి తకఝుణుతక 
తకిట తద్దిమిత.. ధిమిత తక తకిట..
 
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...
స్వరరాగ సంగమ సాధక జీవన
సురగంగ పొంగిన నర్తనశాలల
పదములు చేరగ భంగిమలూదే
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...

ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో ఆఆఆఆఅ...ఓఓఓఓ.. 
ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి
ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి 

 రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో
ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో
నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం
నాకు చెల్లు నవవిధ గమకం - నాకు  ఇల్లు నటనల భరతం
ఉత్తమోత్తమము వృత్తగీతముల
ఉత్తమోత్తమము వృత్తగీతముల 
మహా మహా సభాసదులు మురిసిన...
సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా
ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా...

స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై
సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై
నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై
నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై
వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ 

వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ
మ మ గ గ మ ద మ - మ మ ద స ని ద మ
 

రంపంప రంపపంప
రంపంప రంపపంప రంపంప రంపపంప 
భరతము నెరుగని - నరుడట రసికుడు
rock-u  roll-u ఆట చూడు - బ్రేకు లోని సోకు చూడు
west side-u rhyme మీద twist చేసి పాడి చూడు
పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు
rock rock rock n roll  shake shake shake n roll  

 rock rock rock n roll  shake shake shake n roll  
 రప్ప పా ప - ప పా ప - ప పా ప
ర పా ప పా ప పా ప పా ప పా ప పా ప పా ప
 
తగుదు తగుదు తగుదు తగుదు తగుదు ....  త త

జనగీతము శివ పాద జాతము వచియింపగ  వశమా...

సోమవారం, జులై 21, 2014

ఏవేవో కలలు కన్నాను...

ఇళయరాజా గారి ఒక కమ్మని బాణిని జానకమ్మ స్వరంలో ఈరోజు విని ఆస్వాదించండి. కాస్త విషాదగీతమే అయినా కూడా భావం బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : గోపి
గానం: ఎస్.జానకి

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో .. ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై .. నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు !

ఏవేవో కలలు కన్నాను.. మదిలో

నా కన్నులలో వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ .. ఓదార్పు చూపినావురా
నాది పేద మనసురా .. కాన్కలీయలేనురా
కనుల నీరె కాన్కరా! 

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో...


ఆదివారం, జులై 20, 2014

సీతకోక చిలకలమ్మా...

పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మ లాంటి పాపాయిని పొదువుకున్న అమ్మ ఆనందం తెలియాలంటే ఆడజన్మ ఎత్తాల్సిందేనట... పాపలను సీతాకోక చిలుకలతోనూ సెలయేటితోనూ పోలూస్తూ అమ్మకి పాపాయి ఎంత అపురూపమో వివరిస్తూ సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి... మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.చిత్రం : సొగసు చూడ తరమా (1995)
సంగీతం : రమణి-ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాధా శ్రీరాం

ఆ... ఆ... ఆ... ఆ...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోట కన్నా చిందాడు పసివాడే మిన్నా
బుడత అడుగులే నడిచేటివేళలో పుడమితల్లికెన్ని పులకలో...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా 

  
గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒకవరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చేయి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా అలుపు సొలుపు లేని ఏ అలా...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


శనివారం, జులై 19, 2014

కంటి చూపు చెపుతోంది...

సాధారణంగా ఘంటసాల గారు అనగానె గంభీరమైన స్వరం చక్కని మెలోడియస్ వాయిస్ గుర్తొస్తుంటుంది నాకు, అటువంటిది ఆయన ఇలాంటి పెప్పీ పాట పాడటం వినడానికి భలే తమాషాగా అనిపిస్తుంటుంది. కాస్త హిందీ ట్యూన్ లా అనిపించే ఈ పాట నాకు బాగా నచ్చే పాటలలో ఒకటి. అన్నగారి అభినయం ఘంటసాల గారి గళం ఒకదానికొకటి భలే సూట్ అవుతాయి ఈ పాటలో. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్-జైకిషన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...

ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...

కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఒ పిల్లాఆ...

చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? 
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? 
ఒ పిల్లాఆ...


శుక్రవారం, జులై 18, 2014

ఎన్నో రాత్రులొస్తాయి గానీ...

పెద్దలకు మాత్రమే తరహా పాట అయినా కూడా సాహిత్యం కాస్త భరించగలిగితే ఇళయరాజా గారు చేసిన మరో చక్కని మెలోడియస్ ట్యూన్ ఇది. నాకు చాలా ఇష్టమైన ట్యూన్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ధర్మక్షేత్రం (1992)
సంగీతం : ఇళయరాజా 
 సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥

ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥

ఓఓఓఓఓ.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఒహో.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ


గురువారం, జులై 17, 2014

హాయ్ లైలా ప్రియురాలా...

వినోదం సినిమా నాకు బాగా ఇష్టమైన హాస్య చిత్రాలలో ఒకటి అందులోనుండి ఒక చక్కని మెలోడీ ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వినోదం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , K.S.చిత్ర

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల

వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
మోగాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!


బుధవారం, జులై 16, 2014

కాస్తందుకో .. దరఖాస్తందుకో...

జంధ్యాల గారి రెండు రెళ్ళు ఆరు సినిమాలోని ఓ మంచి పాట మీకోసం. ఇందులో వేటూరి గారి సాహిత్యం బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1986)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే.. ముద్దర వేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

ఆ .. కాస్తందుకో..దరఖాస్తందుకో.. భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో..దరఖాస్తందుకో.. 
ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు .. లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తూ .. లేకుంటె కరిమబ్బూ
మెరుపంత నవ్వునా .. చినుకైన రాలునా
ఆఆఆ.ఆఆఆఆ...ఆఆఆఆఅహాహా..  
జడివాన దరఖాస్తు .. పడకుంటె సెలయేరు
జడివాన దరఖాస్తూ .. పడకుంటె సెలయేరూ
వరదల్లె పొంగునా..కడలింట చేరునా
శుభమస్తు అంటే .. దరఖాస్తు ఓకే !

కాస్తందుకో..ఆఆ..దరఖాస్తందుకో..  
హహ.. భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు .. తొలిఈడు వినకుంటె
చలిగాలి దరఖాస్తూ .. తొలిఈడు వినకుంటే
చెలి జంట చేరునా .. చెలిమల్లె మారునా
ఆఆఆఆఆహాహ్హా...ఆఆఆఆ లాలలలా...
నెలవంక దరఖాస్తు .. లేకుంటె చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తూ .. లేకుంటె చెక్కిళ్ళూ
ఎరుపెక్కి పోవునా .. ఎన్నెల్లు పండునా
దరిచేరి కూడా దరఖాస్తులేలా !

కాస్తందుకో .. దరఖాస్తందుకో .. ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి.. దస్కతు చేసి .. ప్రేయసి కౌగిలి అందుకో
ఆహహ కాస్తందుకో..దరఖాస్తందుకో..ప్రేమ దరఖాస్తందుకో ! మంగళవారం, జులై 15, 2014

ఐతే..అది నిజమైతే...

చిరంజీవి కమర్షియల్ బాటనుండి అపుడపుడు బయటకు వచ్చి చేసిన అతి కొన్ని సినిమాలలో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ శుభలేఖ ఒకటి, ఇందులోని పాటలన్నీ బాగుంటాయి. వాటిలో ఒక చక్కని పాట ఇది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శుభలేఖ (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే..
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ.. నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి..
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా..
కలువ భామ అది వింటే పున్నమిగా
ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...
చందమామ అవునంటే వెన్నెలగా..
కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి 
తలంబ్రాలుగా కురిసే వేళా..చేరువైతే

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే

లాలలాలా..లాలలాలా..లాల..
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక..కొమ్మ దాటి గోరింక.. 
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతీ నక్షత్రం ..
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ.ఆఆఆ... ఊహూ..ఊహూ..మ్మ్మ్మ్...
ఆకసాన అరుధంతీ నక్షత్రం ..
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసందెలు కుంకుమలై కురిసీ 
నుదుట తిలకమై మెరిసే వేళా..చేరువైతే..

ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
లలలలలలలాల నిజమైతే
లలలలలలలాల అదే నిజమైతే..
 

సోమవారం, జులై 14, 2014

అభిమతమో అభినయమో...

జంధ్యాల గారి సినిమాలలో హాస్యమే కాదు పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. జయమ్మునిశ్చయమ్మురా సినిమాలో ప్రేమ గురించిన ఈ చక్కని పాట చూడండి మీరూ ఒప్పుకుంటారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.జయమ్ము నిశ్చయమ్మురా (1989)
సంగీతం :  రాజ్-కోటి
సాహిత్యం : ముళ్ళపూడి శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల

అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేపును సెగలే
ఎదలో మోగును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం

మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమే మైత్రికి అందం 

అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
ఓఓఓ... మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం

కోటి నవ్వులా గూటి గువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎద మంట
భామిని నో అంటే బాధలు మొదలంటా
సరి అనవా వరమిడవా సరసన నవరస మధురసమీవా

మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
ఓఓఓఓ..అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం

మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమే సంపద 

అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం


ఆదివారం, జులై 13, 2014

నవ్వులు రువ్వే పువ్వమ్మా...

మహదేవన్ గారి పాటలంటేనే ఒక మధురమైన బాణిలో అలరిస్తాయి ఇక ఆత్రేయ గారి సాహిత్యమ్ తోడైతే చెప్పేదేముంది. ఈ చక్కని పాట  మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : గాజుల కిష్టయ్య (1975)
సంగీతం : కె .వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : S.P.బాలు

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళు
నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా

ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కేంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసు ఉందమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
..ఆ..పువ్వమ్మా

ఈ తోట మొత్తమూ కమ్మినవి నీ దోరవయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవీ నీ కన్నె మనసులో కైపులు
ఈ తోట మొత్తమూ కమ్మినవి నీ దోరవయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవీ నీ కన్నె మనసులో కైపులు
నువ్వు ఒలకబోసే ఓంపుసొంపులకు ఒడిని పడతానుండమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
..ఆ..పువ్వమ్మా

ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ..
ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో,తేటిగానో పది నాళ్ళున్నాచాలమ్మా 

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా

ఉన్న నాలుగు నాళ్ళు
నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.