మంగళవారం, జులై 29, 2014

ఏక్ దో తీన్ సఖీ ప్రియా...

ఇళయరాజా గారు స్వరపరచిన పాటలలో ఒక అందమైన పాట ఈ పాట. ఇందులో డాన్స్, చిత్రీకరణ, గాయనీ గాయకులు, సాహిత్యం వీటన్నిటికన్నా ఈ పాట ట్యూన్ నాకు ఎక్కువ ఇష్టం. పాటలో అక్కడక్కడ వచ్చే కోరస్ కానీ, పాటంతా వచ్చే రిధమ్ కానీ, చరణాల ముందు వచ్చే మ్యూజిక్ కానీ అసలు ఈ పాట ఎప్పుడు విన్నా మనసంతా ఒక ఆహ్లాదకరమైన అనుభూతితో నిండిపోతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రుద్రనేత్ర  (1989)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే
నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా 

అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి
 
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా
అరె గోలీ మార్ దో ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా


2 comments:

చిరు, ఇళయరాజా, బాలూగారి కంబినేషన్ లో వచ్చిన ప్రతి పాటా ఐఫీస్టే..ఒక టైంలో..ఇప్పుడు ఆడియో తప్ప వీడియో చూడాలంటే మనస్కరించట్లేదు వేణూజీ..

అవునండీ వారి కాంబినేషన్ లో చాలా చక్కని పాటలు ఉన్నాయి. ఇకపోతే వీడియో విషయంలో మీరు చెప్పింది నిజమే శాంతి గారు ఈ హీరో పాటలు పోస్ట్ చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాను నేను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.