శుక్రవారం, జులై 18, 2014

ఎన్నో రాత్రులొస్తాయి గానీ...

పెద్దలకు మాత్రమే తరహా పాట అయినా కూడా సాహిత్యం కాస్త భరించగలిగితే ఇళయరాజా గారు చేసిన మరో చక్కని మెలోడియస్ ట్యూన్ ఇది. నాకు చాలా ఇష్టమైన ట్యూన్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ధర్మక్షేత్రం (1992)
సంగీతం : ఇళయరాజా 
 సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥

ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥

ఓఓఓఓఓ.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఒహో.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ


2 comments:

ఈ పాటలో అక్షారాల కన్నా స్వరాలే వీణ మెట్లలా గుండెని పట్టి కుదిపేస్తాయి..నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి ..ధాంక్యూ..

అవునండీ అమేజింగ్ ట్యూన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.