గురువారం, జులై 17, 2014

హాయ్ లైలా ప్రియురాలా...

వినోదం సినిమా నాకు బాగా ఇష్టమైన హాస్య చిత్రాలలో ఒకటి అందులోనుండి ఒక చక్కని మెలోడీ ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : వినోదం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , K.S.చిత్ర

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!

ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల

వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
మోగాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!


2 comments:

మా అమ్మ ఫావరెట్ డైరెక్టర్ యస్.వి.కృష్ణారెడ్డి గారు..సరదాగా ఆయనని కామెంట్ చేస్తే చాలు..అవునే.. డీసెంట్ మూవీస్ తీసే వాళ్ళు మీకు నచ్చరు అంటూ బుడుగు బామ్మాలా ప్రైవేట్ చెప్పేసేదండి..

థాంక్స్ శాంతి గారు.. ఆయన హీరో గా మారేంత వరకూ నాకు కూడా చాలా ఇష్టమైన దర్శకుడండీ. ఆ తర్వాతే చూడలేకపోయాను. శుభలగ్నం లాంటి సినిమాలలో అటు హాస్యాన్నీ ఇటు సెంటిమెంట్ ని సమంగా బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.